బాలీవుడ్ లో మరో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన సూపర్ 30 ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. గణిత శాస్త్ర నిపుణుడు ఆనంద్ కుమార్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ పై రిలీజ్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొదటి రోజే సినిమాకు మంచి వసూళ్లు అందాయి. ఫస్ట్ వీకెండ్ లో సూపర్ 30 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  50 కోట్లను దాటేసింది. కలెక్షన్స్ ఇలానే కొనసాగితే మరో మూడు రోజుల్లో ఈజీగా 100కోట్లను అందుకోగలదని బాలీవుడ్ ఎనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు. 

గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న హృతిక్ రోషన్ ఫైనల్ గా ఈ సక్సెస్ తో హ్యాపీగా ఫీలవుతున్నాడట. నటన పరంగా సినిమా తృప్తిని ఇచ్చిందంటూ ఇప్పుడు కలెక్షన్స్ ని చూస్తుంటే మరింత కిక్ వస్తోందని హృతిక్ వివరణ ఇచ్చాడు. ఇక హృతిక్ నుంచి నెక్స్ట్ వార్ అనే మరో యాక్షన్ మూవీ సెప్టెంబర్ లో రాబోతోంది.