MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha Post: ట్రెండ్‌ అవుతోన్న సమంత పోస్ట్.. అర్థాలు వెతుక్కుంటున్న నెటిజన్లు.. చెడు తర్వాత మంచేనా?

Samantha Post: ట్రెండ్‌ అవుతోన్న సమంత పోస్ట్.. అర్థాలు వెతుక్కుంటున్న నెటిజన్లు.. చెడు తర్వాత మంచేనా?

సమంత ఒక సంచలనం. ఆమె నిర్ణయాలు ఇప్పుడు సంచలనాత్మకంగానే మారుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది సమంత. తన గురించి అంతా చర్చించుకునేలా చేస్తుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 12 2021, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha

సమంత(Samantha) నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల(Divorce) ప్రకటన అనంతరం డేరింగ్‌గా ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంది. తన జీవితంలో చోటు చేసుకుని క్లిష్టమైన పరిస్థితి నుంచి, మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకు కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. నిత్యం బిజీగా ఉండాలని భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. అదే సమయంలో పరోక్షంగా తన మనసులోని బాధని పోస్టుల రూపంలో, కొన్ని కొటేషన్ల రూపంలో పంచుకుంటుంది సమంత. తన జీవితంలో చోటుచేసుకున్న విషయాలను అభిమానులకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సమంత పంచుకున్న ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. నిత్యం వరుసగా పోస్ట్ లు పెడుతూ అభిమానులకు తన ఆవేదన తెలియజేస్తుంది. జనాలకు కూడా తన బాధని తెలిపే ప్రయత్నం చేస్తుంది. తాజాగా సమంత ఓ కొట్టేషన్‌ని పంచుకుంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో  ఓ ఫోటోని(Samantha Post) పంచుకుంది. ఇందులో జరగబోయే మంచి గురించి చెప్పింది. 

36

`ఏదో మంచి జరగబోతుందనే విషయాన్ని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి` అని పోస్ట్ చేసింది Samantha. ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్న ఈ పోస్ట్ ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తుంది. సస్పెన్స్ ని క్రియేట్ చేయబోతుంది. సమంత తన జీవితానికి సంబంధించిన ఏదో విషయాన్ని చెప్పబోతుందనే కామెంట్లు వస్తున్నాయి. త్వరలో తాను మంచి పనులతో ముందుకు రాబోతుందని, తన జీవితంలో మరో మంచి జరగబోతుందనే విషయాన్ని సమంత చెబుతుందని అంటున్నారు నెటిజన్లు.

46

అయితే ప్రస్తుతం సమంత జీవితంలో చెడు జరిగింది. తాను ఎంతో ప్రేమించిన పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడిపోయారు. నాలుగేళ్ల అన్యోన్న బంధానికి అక్టోబర్‌ 2న ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఇది సమంత జీవితంలో అతిపెద్ద విషాదంగా చెప్పొచ్చు. దాన్నుంచి బయటపడటం అంతా ఈజీ కాదు.  కానీ సమంత ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ఆమె బ్యాక్‌ టూ బ్యాక్ టూర్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

56

విడాకుల ప్రకటకు ముందు ఫ్రెండ్స్ తో వెకేషన్‌కి వెళ్లింది. ఆ తర్వాత చార్ ధామ్‌ యాత్ర నిర్వహించింది. చాలా రోజులపాటు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయింది. ఆ తర్వాత దుబాయ్‌కి వెళ్లింది. అక్కడ తనకు నచ్చి విధంగా షాపింగ్‌ చేయడం, నచ్చిన ఫుడ్‌ తినడం, నచ్చిన విధంగా ఎంజాయ్ వంటివి చేసింది సమంత. మొత్తంగా తనకి తాను బిజీగా ఉంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది సమంత. ఇష్టమైన పనులు చేస్తూ బిజీగా ఉంటుంది. అందులో భాగంగా పెయింటింగ్‌ కూడా వేస్తుంది 

66

ఇదిలా ఉంటే సమంత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో రాబోతుంది. ప్రస్తుతం ఆమె `శాకుంతలం` చిత్రంలో నటించింది. మరోవైపు తమిళంలో `కాథువాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటించింది. ఇవి విడుదలకు రెడీ అవుతున్నాయి. మరోవైపు ఇటీవల రెండు తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రాలను ప్రకటించింది. బాలీవుడ్‌లోకి కూడా వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది సమంత. 

also read: యంగ్ హీరోయిన్ జీవితం నిలబెట్టిన సమంత.. ఆమె కన్నీటి కష్టాలు వింటే, షాకింగ్ డీటెయిల్స్

also read: Samantha: విడాకుల ప్రకటన వంటి హార్ట్ బ్రేక్‌ ఘటన నుంచి బయటపడేందుకు సమంత ఏం చేస్తుందో తెలుసా ?.. 7 దారులు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Recommended image2
Rashmika Mandanna: మరోసారి అద్భుతం చేసిన రష్మిక మందన్న.. ఫిదా అవుతున్న నార్త్ ఆడియన్స్, అభిమానులు ఏమంటున్నాంటే?
Recommended image3
Folk Song : ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పే బ్లాక్‌బస్టర్ జానపదం.. 6 రోజుల్లోనే 4.7M వ్యూసా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved