పోర్న్ స్టార్ నుండి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తార సన్నీలియోన్. ఓ వైపు బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ తనకు దక్కిన ఆఫర్లను ఒడిసిపట్టుకుంటున్న ఈ సెక్స్ బాంబ్...సినిమాలతో పాటు వ్యాపారం వైపు కూడా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సుగంధ పరిమళాల వ్యాపారాన్ని నడిపిస్తున్న సన్నీ..ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఓ 'మేకప్ యాప్'ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఈ ఆలోచన తనకు చాలాకాలంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. మేకప్ విషయంలో సాధారణంగా మహిళలు చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారని, ముఖానికి ఏ రంగు నప్పుతుంది, పెదాలకు ఏ లిప్‌స్టిక్ కలర్ వేసుకోవాలి...తదితర విషయాల్లో చాలా అయోమయానికి గురవుతుంటామని సన్నీ చెబుతోంది. ఇది మహిళలకు ఎంతగానో యూజ్ అవుతుందని ఆమె అంటోంది.