బాలీవుడ్‌ తెరపై ఓ వెలుగు వెలుగుతున్న పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ బాలీవుడ్‌ సినిమాల్లోకొచ్చిన కొత్తల్లో అస్సలామెకు డాన్స్‌ వచ్చేది కాదట‌ డాన్స్‌ నేర్చుకోవాలన్న కసితో మాస్టర్‌'ని నియమించుకుని  ప్రాక్టీస్‌ చేశాననంటున్న  బ్యూటీ


 అయితే, బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాక, ఒకటి రెండు సినిమాలు చేసిన తనకు, తన డాన్స్‌ గురించి చాలా ఆవేదన కలిగేదనీ, తనకు డాన్స్‌ రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, కొందరు ఎగతాళి చేసిన వైనం తనకింకా గుర్తుందని అంటోంది సన్నీలియోన్‌. అందుకే, డాన్స్‌ నేర్చుకోవాలన్న కసి పెరిగి, స్పెషల్‌గా డాన్స్‌ కోసం 'మాస్టర్‌'ని నియమించుకుని, డాన్సులు ప్రాక్టీస్‌ చేశాననీ చెప్పుకొచ్చిందీ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో.

స్టేజ్‌ షోలు ఇప్పుడు సన్నీలియోన్‌కి చాలా కామన్‌ అయిపోయాయి. ఐటమ్‌ సాంగ్స్‌లోనూ ఆఫర్స్‌ వచ్చిపడ్తున్నాయి. 'నేనేం చెయ్యలేననుకున్నారో.. అవన్నీ చేసి చూపిస్తున్నాను.. ఒకరకంగా ఇది స్వీట్‌ రివెంజ్‌ అనుకోవచ్చేమో..' అంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది సన్నీలియోన్‌. 'జస్ట్‌ ఫర్‌ ఫన్‌..' అంటూనే, అంత సీరియస్‌గా సన్నీలియోన్‌ 'రివెంజ్‌' తీర్చుకుంటోందంటే, బాలీవుడ్‌లో ఆమెకు అవమానాలు ఓ రేంజ్‌లోనే ఎదురయి వుండాలి.