సన్నీ డియోల్‌ 'లాహోర్ 1947' సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. సినిమాకి కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది.

సన్నీ డియోల్‌ 'లాహోర్ 1947' అప్డేట్: సన్నీ డియోల్‌ 'జాట్' సినిమాతోపాటు 'బోర్డర్ 2' సినిమాతోనూ వార్తల్లో ఉన్నారు. `జాట్‌` ఇప్పటికే విడుదలైంది డీసెంట్‌గా ఆడింది. ఇక ప్రస్తుతం డెహ్రాడూన్‌లో 'బోర్డర్ 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు సన్నీ. దీంతోపాటు 'లాహోర్ 1947' చేస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

సన్నీ 'లాహోర్ 1947' ఎందుకు లేట్?

సన్నీ డియోల్‌, ప్రీతి జింటా నటిస్తున్న 'లాహోర్ 1947' సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందట. దీంతో కొన్ని సీన్స్‌ని మళ్ళీ షూట్ చేయనున్నారు. 1947 నాటి విభజన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే స్క్రిప్ట్‌ని మళ్ళీ సిద్ధం చేస్తున్నారు.

'లాహోర్ 1947' రిలీజ్ వాయిదా

'ఆపరేషన్ సింధూర్' తర్వాత 'లాహోర్ 1947' షూటింగ్ ఆగిపోయింది. ఇంకా 10 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. కానీ స్క్రిప్ట్ మార్పుల వల్ల షూటింగ్ ఆలస్యం కానుంది. దీంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆమీర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శబానా ఆజ్మీ, అలీ ఫజల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.