1997లో బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, కరిష్మా కపూర్‌లపై కేసులు నమోదయ్యాయి. అప్పటికి వీరు కలిసి నటిస్తోంది 'భజరంగ్' అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. రాజస్థాన్‌లోని సన్వార్దా గ్రామంలో ఉన్న ట్రైన్ లో షూటింగ్ జరిగింది.

ఆ సమయంలో కరిష్మా, సన్నీ కావాలనే చెయిన్ లాగేశారట. దీంతో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా పనిచేసిన సీతారామ్ మలకార్  రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగి న్యూసెన్స్  క్రియేట్ చేశారని, రైల్వే సిబ్బందిని సరిగ్గా డ్యూటీ చేసుకోనివ్వలేదని ఇలా వీరిపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసు నమోదు చేసి ఇప్పటికి దాదాపు ఇరవై ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో కోర్టు 2009లో కరిష్మా, సన్నీ డియోల్ లకు శిక్ష విధించింది. దీంతో వారు ఎలాంటి తప్పు చేయలేదు 2010లో సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు.  వారి పిటిషన్‌ను పరిశీలించిన సెషన్స్ కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చి విడుదల చేయాలని కోరింది.

ఇప్పుడు మరోసారి ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రీసెంట్ గా రైల్వే కోర్టు మళ్లీ కరిష్మా, సన్నీపై కేసులు పెట్టింది. దీంతో కరిష్మా, సన్నీ మరోసారి సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును న్యాయస్థానం 24 సెప్టెంబర్‌కు వాయిదా వేసింది.