సునీల్, త్రివిక్రమ్ మంచి ప్రెండ్స్. ఇద్దరూ రూమ్, కష్టాలు అన్ని షేర్ చేసుకున్నారు. కలిసే సినీ ప్రయత్నాలు చేసారు. మొత్తానికి సునీల్‌ కమెడియన్‌ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సెట్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాడు. ఈ లోగా త్రివిక్రమ్‌ క్లిక్ అవ్వటంతో ఆయన సినిమాల్లో చేసిన క్యారక్టర్స్ ఓ రేంజిలో క్లిక్ అవ్వటంతో సునీల్‌ స్టార్‌ కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలో సునీల్‌ హీరోగా మారాడు. హీరోగా ఆఫర్లు వస్తున్న సమయంలో చేయడం లో తప్పు లేదు. కానీ వాటినే నమ్ముకుని కామిడియన్ క్యారక్టర్స్ కు దూరం అయ్యాడు. 

ఒకానొక సమయంలో సునీల్‌ నాలుగు అయిదు పెద్ద హీరోల సినిమా లను వదిలేశాడు అంటూ వార్తలు వచ్చాయి.హీరోగా కొన్నాళ్ల పాటు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత మొత్తం తలకిందులు అయ్యింది. తను చేసిన సినిమాలు వరస డిజాస్టర్స్ అయ్యాయి.  హీరోగా ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ కమెడియన్‌ గా చేసేందుకు సిద్దం అయ్యాడు.కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.క్యారక్టర్ రోల్స్ చేస్తున్నాడు. విలన్ గానూ కనిపిస్తున్నాడు. కానీ ఏదీ వర్కవుట్ అవ్వటం లేదు. 
 
త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన 'అరవింద సమేత' చిత్రం ద్వారా  క్యారక్టర్ యాక్టర్ కమ్ కమిడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ వరస సినిమాలతో బిజీగా వున్నాడు. అయితే సునీల్ కు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో  బ్రేక్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావించారట. ఈ నేపధ్యంలోనే మహేష్  హీరోగా రూపొందించే సినిమాలోను సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ రోల్ ను డిజైన్ చేశాడట. ఈ పాత్రతో సునీల్ కి పూర్వ వైభవం రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అది హిలేరియస్ కామెడీతో సాగుతుందిట. అతడు,ఖలేజా సినిమాల్లో పాత్రను మించి ఉండబోతోందిట. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా లాంచ్ అవుతుంది.  వచ్చే సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుంది.