Asianet News TeluguAsianet News Telugu

ALLU ARJUN-PUSHPA : రాజమౌళితో త్వరలో సినిమా ఉంటుంది : అల్లు అర్జున్

పుష్ప సినిమా కోసం చాలా కష్టపడ్డామన్నారు అల్లు అర్జున్. ఇంతకు ముందు ఏ సినిమాకు పనిచేయనంతగా ఈ సినిమా కోసం పనిచేశామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదరైనా... వాటిని అధిగమిస్తూ.. వర్క్ ను ఎంజాయ్ చేస్తూ చేశామన్నారు. అందుకే  తన కెరీర్ లో పుష్ప ప్రత్యేక మైన సినిమా అవుతుందన్నారు అల్లు అర్జున్. అంతే కాదు త్వరలోనే రాజమౌళితో సినిమా ఉండొచ్చంటూ.. హింట్ ఇచ్చారు బన్ని. ఇంకా ఈసినిమా గురించి అల్లు అర్జున్ ఏం చెప్పారంటే..? 
 

Allu Arjun Talks About Pushpa Movie
Author
Hyderabad, First Published Dec 15, 2021, 10:51 AM IST

ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది అల్లు అర్జున్ పుష్ప సినిమా. ఈ సందర్భంగా సినిమా విశేషాలు పంచుకున్నారు బన్ని. ఈ సినిమా కథను సుకుమార్  10 నిమిషాల్లో బ్రీఫ్ గా చెప్పాడు. గతంలో కలిసినప్పుడల్లా ఏదో ఒక కథ గురించి డిస్కర్షన్స్ జరిగేవి. కాని ఈ కథ విన్న వెంటనే ఏం ఆలోచించకుండా సినిమాకు ఒకే చెప్పానన్నారు అల్లు అర్జున్. అయితే మాతో పాటు మైత్రీవాళ్లు తోడవడంతో సినిమా స్టార్ట్ అయ్యింది. మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ ముందు సాగామన్నారు అల్లు అర్జున్. 


ఆర్య,ఆర్యా2 సినిమాల విషయంలో సరదాగా సాగిపోయింది. సినిమాలు హిట్ అయ్యాయి. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. పుష్ప సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాము. సుకుమార్ కూడా పుష్ప హిట్ కావాలని పట్టుదలతో పనిచేశారు. ఈసినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు.. నా క్యారెక్టర్ గురించి ఎటువంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని ఆలోచిస్తున్నా..


పుష్ప స్టార్ట్ అయిన తరువాత దాదాపు 10 నెలలు కరోనా వల్ల ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ టైమ్ ను వేస్ట్ చేసకుండా వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటూ.. సినిమాను డెవలప్ చేసకున్నాం. అంతే కాదు గ్యాప్ టైమ్ లోరాయలసీమ యాసను పట్టుబట్టి గట్టిగా ప్రాక్టీస్ చేస్తూ.. గడిపేశాను, ఈ సినిమాకు బలం ఈ చిత్తూరు యాసే అన్నారు బన్ని. 


సినిమాలో ప్రతీ ఒక్క ఎలిమెంట్ ను సుకుమార్ వదిలిపెట్టకుండా చూసుకున్నారు. ఇక నా మేకప్ అయితే.. ముంబయ్ టెక్నీషియన్స్ తో రెండు మూడు గెటప్ లు అనుకున్న తరువాత ఒకటి ఫైనల్ చేశాము. పుష్ప రాజ్ గెటప్ మేకప్ వేసుకోవడానికి రెండు గంటలకు పైనే టైమ్ పట్టేది. ఇక మేకప్ తీయ్యడానికి అరగంటకు పైగా కష్టపడాల్సి వచ్చేది. మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే.. ఈ సినిమాలో బుజం పైకి ఎత్తి యాక్ట్ చేయాలి. ఈ బుజానికి గతంలో రెండు సార్లు సర్జరీ జరిగింది. దాంతో షార్ట్ టైమ్ లో నొప్పితో చాలా ఇబ్బంది పడ్డానంటును. 

 

ఈ సినిమాలో ముఖ్యమైన భాగం మారేడు మిల్లిలో జరిగిన షూటింగ్. ఈ షూటింగ్ కోసం రోడ్డు కూడా సరిగ్గా లేని.. మారుమూల ప్రాంతాలకు వెళ్ళి షూట్ చేయాల్సి వచ్చేది. కొంత దూరం రోడ్డు వేయించినా.. అది వర్షాలకు కొట్టుకుపోయేది. అలానే 400 కార్లతో..రోజూ అడవిలో ప్రాయాణించి షూటింగ్ చేశాము. అంత అందమైన ప్రాంతం ఉంది అని అస్సలు అనుకోలేదు. అటువంటి అడవులు కాపాడటం కోసం.. షూటింగ్ అయిపోగానే అక్కడ అంతా చెత్త లేకుండా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేశాము. 

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలి అనుకోవడం, పాన్ ఇండియా రేంజ్ లో తీసుకెళ్ళడం ముందే అనుకున్నవి కాదు. ఇది అచ్చమైన తెలుగు సినిమాగా స్టార్ట్ అయ్యింది. ఆతరువాత ఇతర భాషల్లోకి తీసుకెళ్లాలి అనుకున్నాం. మలయాళ ఇండస్ట్రీలో నా సినిమాలు బాగా ఆడతాయి. అందుకే అటు వైపు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఇక ఈ సినిమా ఎంత తగ్గించాలి అనుకున్నా.. 4 గంటల వరకూ వస్తుంది. అందుకే రెండు భాగాలుగా చేస్తేనే.. అనుకున్న లైన్ ను ఆడియన్స్ కు వివరించగలం కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాం. 


ప్రి రిలీజ్ లో రాజమౌళిగారి మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఆయన అలా అనడం అదృష్ణం. ఇంత వరకూ ఎవరిని నేను అడగలేదు.. కాని ఆయనతో అన్నా.. మీతో సినిమా చేయాలని ఉంది అని. దానికి రాజమౌళి గారు కూడా నేను సినిమా చేయాలి అనుకుంటున్న హీరోలలో నువ్వు కూడా ఉన్నావ్.. త్వరలో చేద్దాం అని అన్నారు. 

Also Read: MEGASTAR : మెగాస్టార్ కొత్త సినిమా ఫిక్స్... కుర్ర హీరోలకు షాకిస్తున్న చిరు.


సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి ప్రమోషన్స్ చేస్తే.. సినిమా హిట్టు అన్న సెంటిమెంట్ ఉంది. కాని పోస్ట్ ప్రొడక్షన్ బిజీ వల్ల వారిద్దరు ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వలేక పోయారు. దేవిశ్రీ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రష్మిక చాలా క్యూట్ గా నటించింది. ఫహద్ తో పనిచేయడం చాలా హ్యాపీ అనిపించింది. మామీద  నమ్మకంతో సమంత స్పెషల్ సాంగ్ చేసినందకు కృతజ్ఞతలు.


పుష్ప పార్ట్ 2 గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. సినిమా రిలీజ్ తరువాత ఓ నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఆతరువాతే ఏం చేయాలి అనేది చూస్తాను. పుష్పా రెండు సినిమాలు ఒకే ఏడాది వస్తే బాగోదు అనే.. పార్ట్ 1ను ఈ ఏడాది రిలీజ్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాం.  ఇప్పటి వరకూ పుష్ప రిలీజ్ పైనే దృష్టి పెట్టాను. ఏపీలో పరిస్థితులు చక్కబడతాయి అన్న నమ్మకం ఉంది. కోర్తు తీర్పు అనుకూలంగా రావడం సంతోషకరమే అన్నారు అల్లు అర్జున్. 
 

Also Read: Balakrishna:అన్నింటికీ సిద్ధపడే అఖండ విడుదల చేశాం.. టికెట్స్ ధరల తగ్గింపు జీవో రద్దుపై బాలకృష్ణ స్పందన

Follow Us:
Download App:
  • android
  • ios