సునీల్‌ హీరోగా ఎన్‌.శంకర్‌ దర్శక నిర్మాణంలో మహాలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం.2 చిత్రం త్వరలో రూపొందనుంది. మలయాళ సినిమా `టు కంట్రీస్` చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం న‌వంబ‌ర్ 7 నుండి లాంచ‌నంగా ప్రారంభం కానుంది. 

సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం.2 చిత్రం ఎన్‌.శంకర్‌ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మళయాలంలో హిట్ సినిమా టు కంట్రీస్ సినిమా ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. `మ‌ల‌యాళంలో టు కంట్రీస్ సినిమా చూడ‌గానే బాగా న‌చ్చింది. ఈ సినిమా బాగా సునీల్‌ యాప్ట్‌ అవుతుందనిపించి, మ‌ల‌యాళంలో 55 కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ చిత్రంలోని కామెడి, ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్స్‌ అన్నీ బాగుంటాయి. ఈ పాత్ర సునీల్‌ తప్ప ఎవరూ చేయలేరు. ఇది యూనివర్సల్‌ మూవీ. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. మంచి స్క్రిప్ట్ కుదిరింది. శ్రీధ‌ర్ సీపాన మంచి సంభాష‌ణ‌లు కుదిర్చారు. మ‌ల‌యాళంలో `టు కంట్రీస్` చిత్రానికి సంగీతం అందించిన గోపీసుంద‌ర్‌ తెలుగులో సంగీతాన్ని అందిస్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా నాకు, సునీల్‌కు మంచి బ్రేక్ నిచ్చే సినిమా అవుతుంద‌ని భావిస్తున్నాను అన్నారు.

ఈ సినిమా న‌వంబ‌ర్ 7న లాంచ‌నంగా ప్రారంభమై అదే రోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తామని దర్శక నిర్మాత శంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఓరిజినల్‌ ప్లేవర్‌ మిస్‌ కాకుండా స్క్రిప్ట్‌ను బెటర్‌ మెంట్‌ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తాం`` అన్నారు. 

సునీల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్‌, నిర్మాత, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌.