'అరవింద సమేత'లో ఎన్టీఆర్ గురువు ఎవరో తెలుసా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 6, Sep 2018, 6:32 PM IST
sunil role in aravinda sametha movie
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముఖ్య పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముఖ్య పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో కూడా సునీల్ కనిపించాడు. త్రివిక్రమ్ కి సునీల్ ఎంత మంచి స్నేహితుడో అందరికీ తెలిసిందే.

అలాంటిది తన స్నేహితుడిని ఈ సినిమా ఎలా చూపించబోతున్నాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు సినిమా మొత్తం కూడా సునీల్ కనిపిస్తాడట. ఒక డ్యూయట్ లో కూడా సునీల్ కి అవకాశం కల్పించారని సమాచారం. ఇక సినిమాకు హైలైట్ ఏంటంటే.. సినిమాలో ఎన్టీఆర్.. సునీల్ ని 'గురువు గారు' అని పిలుస్తుంటాడట. గతంలో కొన్ని సినిమాల్లో హీరోలు కామెడియన్లను గురువు గారు అని పిలుస్తూ కామెడీ పండించారు.

ఎన్టీఆర్ సైతం అదుర్స్ సినిమాలో బ్రహ్మానందాన్ని 'గురువు గారు' అని పిలుస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేశారు. ఈసారి ఎన్టీఆర్ కి  గురువుగా సునీల్ మారబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ సునీల్ పట్ల అతి గౌరవం ఉన్నట్లు ప్రవర్తిస్తూ కామెడీ పండిస్తాడట. మొత్తానికి త్రివిక్రమ్ తన స్నేహితుడి కోసం మంచి ట్రాకే రాసుకున్నట్లున్నాడు. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!

loader