Asianet News TeluguAsianet News Telugu

సునీల్ తో సినిమా ప్లానింగా?, అయితే ఇదీ కండీషన్

కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు సునీల్‌ కమెడియన్‌గా పలు సినిమాల్లో బిజీ అయిపోయాడు. రీసెంట్ గా పుష్పలో నెగెటీవ్‌ రోల్‌ చేసి ప్రేక్షకులు మెప్పు పొందాడు. 

Sunil is ready to do roles in small-budget films
Author
First Published Jan 24, 2023, 10:20 AM IST


ఓ టైమ్ లో స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్‌ ఆ తర్వాత అందాల రాముడు చిత్రం నుంచి హీరోగా మారారు. ఆ సినిమా విజయంతో వరసపెట్టి సినిమాలు చేసాడు. అయితే మర్యాద రామన్న చిత్రం తప్పించి ఏ చిత్రం కలిసి రాలేదు. సరైన స్క్రిప్టులు ఏమీ సునీల్ చేతికి రాలేదు. కమిడయన్ ఉన్నప్పుడు ఉన్న కామెడీ హీరోగా మారాక ఆయన సినిమాల్లో మాయమైపోయింది.  దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు సునీల్‌ కమెడియన్‌గా పలు సినిమాల్లో బిజీ అయిపోయాడు. రీసెంట్ గా పుష్పలో నెగెటీవ్‌ రోల్‌ చేసి ప్రేక్షకులు మెప్పు పొందాడు. 

పుష్ప సినిమాతో సునీల్‌కు సౌత్ లో మంచి క్రేజ్‌ వచ్చింది. దాంతో ఇతర భాషల నుండి కూడా వరుసగా ఆఫర్‌లు వస్తున్నాయి. ఇక ఇప్పటికే తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. .పుష్ప సినిమా లో మంగళం శ్రీను పాత్ర లో సునీల్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.అందుకే ఇప్పుడు వరుసగా ఆయనకు విలన్ పాత్రలు వస్తున్నాయి. తమిళం లో సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమా లో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. కాగా తాజాగా మరో బిగ్‌ బడ్జెట్‌ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేశాడు. విశాల్‌ హీరోగా నటిస్తున్న మార్క్‌ ఆంటోనిలో సునీల్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చిత్రటీమ్ సునీల్‌కు వెల్‌కమ్‌ చెబుతూ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

మూడు నాలుగు తమిళ సినిమాల్లో కూడా సునీల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి తెలుగు లో కంటే కూడా తమిళనాట సునీల్ బిజీగా ఉన్నాడు.అంతే కాకుండా తెలుగు లో తీసుకుంటున్న పారితోషికం తో పోలిస్తే తమిళ సినిమాలకు తీసుకుంటున్న పారితోషికం ఎక్కువ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపధ్యంలో తను తమిళంలోనూ వరస పెట్టి విలన్ గా సినిమాలు చేస్తున్న నేపధ్యంలో తను చేసిన, చేయబోయే తెలుగు చిన్న చిత్రాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

సునీల్ తన దగ్గరకు వచ్చే చిన్న సినిమాలు సైతం చేస్తాను అంటున్నారు. అయితే ప్రమోషన్స్ లో కనపడలేనని ముందే చెప్పేస్తున్నారు. తన బిజి షెడ్యుల్స్ లో ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియని పరిస్దితి అని, కాబట్టి ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నాడు.  అయితే, నిర్మాతలు సినిమాల పబ్లిసిటీ క్యాంపైన్ లో అతని ముఖం, పేరును ఉపయోగించవచ్చు. కాబట్టి వరస పెట్టి ఇప్పటికే చేసిన చిత్రాల పోస్టర్లలో సునీల్ ముఖం కనిపిస్తుంది, కానీ ప్రచార కార్యక్రమాలలో అతను ఎక్కడా కనిపించడు. అలాంటి మరో చిన్న బడ్జెట్ చిత్రం వాలెంటైన్స్ నైట్ పేరుతో ఈ నెల 26న విడుదల కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios