కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కు గత కొంతకాలంగా హిట్ అనేది లేకుండా పోయింది. ఏ సినిమా చేసినా వారం కూడా ఆడటం లేదు.  మినిమం ఓపినింగ్స్ కూడా రావటం లేదు. దాంతో ఆయన్ని హీరోగా పెట్టి సినిమాలు చేసేవారు తగ్గిపోయారు. దాంతో మళ్లీ వెనక్కి వెళ్లి కమెడియన్ గా బిజి అవుదామని ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే అవీ వర్కవుట్ కావట లేదు.

ఎంతో ఆశించి చేసిన అరవింద సమేత చిత్రం లో సునీల్ గురించి మాట్లాడుకున్నవాళ్లే లేరు. అల్లరి నరేష్ తో చేసిన సిల్లీ ఫెలోస్ అయితే మరీ దారుణం. ఈ నేపధ్యంలో సునీల్ మరో కొత్త చిత్రం కమిటయ్యాడు. వివరాల్లోకి వెళితే..రచ్చ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఓ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న విషయం తెలిసిందే.

గోపీచంద్ కోసం సంపంత్ నంది ఓ మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. గోపిచంద్ కి కూడా సంపత్ చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చి వెంటనే సినిమాని పట్టాలెక్కించాలని డిసైడ్ అయిన్నట్లు సమాచారం. ఇక  ఈ సినిమాలో గోపీచంద్ తో మరో  కీ క్యారక్టర్  కూడా ఉందట. సినిమా మొత్తం హీరోతో పాటు ఉండే ఆ పాత్ర, సునీల్ చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు  భావించి సునీల్ ని ఎప్రోచ్ అయ్యారట. 

ఈ సినిమా కనుక వర్కవుట్ అయితే తనకు మళ్లీ బ్రేక్ వస్తుందని రెమ్యునేషన్ విషయంలోనూ పట్టుపట్టక ఓకే చెప్పేసాడట.  మార్చి నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అధికారికంగా ప్రారంభం కానుంది.