సునీల్ లోపలున్నోడు మళ్లీ బయిటకు,తప్పు చేస్తున్నాడా?
మళ్ళీ కమెడియన్ గా, క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా తన కెరీర్ ను కొత్త టర్న్ తీసుకున్నాడు. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చాడు సునీల్.
స్టార్ కమెడియన్‌గా వెలుగుతున్న టైమ్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ హీరోగా మారాడు సునీల్. ఆ క్రమంలో 'అందాలరాముడు, పూలరంగడు, మర్యాదరామన్న' వంటి చిత్రాలతో సక్సెస్‌లను అందుకున్నప్పటికీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో మళ్ళీ కమెడియన్ గా, క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా తన కెరీర్ ను కొత్త టర్న్ తీసుకున్నాడు. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చాడు సునీల్.
రీసెంట్ గా కలర్ ఫోటో చిత్రంలో విలన్ గా అందరినీ అలరించాడు. శాడిస్టిక్ విలన్ రామరాజు పాత్రలో మెప్పించాడు. ఇలా వరుస సినిమాలతో బిజీ అవుతున్న తరుణంలో సునీల్, మరోసారి హీరోగా నటించబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మీడియా వర్గాల నుంచి అందుతున్న వివరాల ప్రకారం కన్నడ సూపర్ హిట్ చిత్రం 'బెల్‌బాటమ్'ను తెలుగులో రీమేక్ కాబోతోంది. కామెడీతో కూడిన స్పై మూవీగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, హరిప్రియ జోడీ కట్టారు.
ఇప్పుడు కన్నడ రీమేక్‌లో సునీల్‌ను హీరోగా నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుందని టాక్ వినిపిస్తోంది. సునీల్ కు హీరో గా చేయటమంటే ప్రాణం అని, ఏదో టైమ్ బాగోక,ప్లాఫ్ లు వచ్చి ఆగాడు కానీ అతని లోపలున్నోడు ఆగేటట్లులేడంటున్నారు. హీరో గా ఆఫర్ ఇస్తే రెమ్యునేషన్ తగ్గించుకుని మరీ చేయటానికి సిద్దపడుతున్నట్లు చెప్తున్నారు. అయితే హీరోగా నిలదొక్కుకోవటం కష్టం కాబట్టి మళ్ళీ అటువైపు వెళ్లకపోవటమే బెస్ట్ అని కొందరంటున్నారు.
ఇక కొద్ది కాలం క్రితం సునీల్ ప్రధాన పాత్రలో ‘వేదాంతం రాఘవయ్య’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్. ఈ చిత్రానికి శంకర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే సినిమాలో నటించబోయే నటీనటులు, దర్శకుడు సహా ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే వేదాంతం రాఘవయ్య అనే పోస్టర్‌ను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో పంచుకున్నారు. హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ సినిమాకు కథ, మాటలు అందించి ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తారని సినీ ఇండస్ట్రీలో టాక్.