ఇండస్ట్రీలో కొద్దిగా తగ్గామంటే పూర్తిగా తగ్గించేసి తమ పబ్బం గడుపుకుందామనుకునే వాళ్లే ఎక్కువ. ముఖ్యంగా ప్లాఫ్ లో ఉన్న వాళ్ల రెమ్యునేషన్ అమాంతం తగ్గించేసి, వారికి ఇచ్చే ఫెసిలిటీస్ ని పూర్తిగా ఆపేసి వాడేసుకునేమనకునే దర్శక,నిర్మాతల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్న సునీల్ కు ఇవన్నీ తెలుసు. అందుకే కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటున్నాడట. ముఖ్యంగా రెమ్యునేషన్ విషయంలో.

సునీల్  హాస్యనటుడు గా సక్సెస్ అయ్యి అందాల రాముడుతో హీరోగా మారి సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత మర్యాదరామన్న, పూలరంగడు వంటి హిట్స్ ఇచ్చినా  ఆ తర్వాత చెప్పుకోవటానికి హిట్ అనేది లేకుండా పోయింది. వరస ఫెయిల్యూర్స్  తో తన ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చుకున్న సునీల్ మళ్ళి సపోర్టింగ్ రోల్స్ కు వచ్చేసి ఆఫర్స్ బాగానే రాబట్టుకుంటున్నాడు. 

అరవింద సమేత వీర రాఘవతో మొదలు రవితేజ డిస్కో రాజా దాకా కాస్త చెప్పుకోదగ్గ పాత్రలే వస్తున్నాయి.  అయితే అతన్ని సపోర్టింగ్ రోల్స్ కు రెమ్యునేషన్ తగ్గించుకోమని అడుగుతున్నారట. రోజుకు లక్ష తీసుకునే సునీల్ ని యాభై వేలుకు తెద్దామని వారి ప్రయత్నంట. ఈ విషయం అర్దం చేసుకున్న సునీల్..తన రెమ్యునేషన్ కు పైసా తగ్గినా తను చేయాల్సిన అవసరం లేదని చెప్పేస్తున్నాడని టాక్. 

హీరోగా సునీల్ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ కమిడయన్ గా అతను సూపర్ సక్సెస్. అతని మార్కెట్ ఇప్పటికీ కమిడియన్ గా చెక్కు చెదరలేదు. సునీల్ కూడా తమ సినిమాలో ఉన్నాడని చెప్పి బిజినెస్ చేసుకునే నిర్మాతలు ఉన్నారు. ఈ నేపధ్యంలో తనకు రేటు తగ్గించుకుని నటించాల్సిన అవసరం అయితే లేదు.  దానికి తోడు ప్రస్తుతం చేస్తున్న  గోపిచంద్ చాణక్యలో పాత్ర మాత్రం కొంత వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక సునీల్ ఇంటిముందు దర్శక,నిర్మాతలు క్యూ కట్టే అవకాసం ఉందిట.