ఒకప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ గా దూసుకుపోయిన సునీల్ ఆ తరువాత హీరోగా టర్నింగ్ తీసుకున్నాడు. దీంతో వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృధ్వీ వంటి నటులకి డిమాండ్ పెరిగిపోయింది. అయితే హీరోగా సునీల్ కి ఫ్లాప్ లు రావడంతో మళ్లీ కమెడియన్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు నటించిన 'సిల్లీఫెలోస్' సినిమా ఫ్లాప్ గా నిలిచింది. 

ఎన్టీఆర్ 'అరవింద సమేత'లో కామెడీ పండించే ఛాన్స్ సునీల్ కి దక్కలేదు. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో మాత్రం సునీల్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడని అంటున్నారు. ట్రైలర్ లో కూడా సునీల్ కామెడీ సీన్లు కనిపించాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే సునీల్ డిమాండ్లు మాత్రం పెరిగిపోయాయని టాక్. సినిమాలో కామెడీ పాత్ర పోషించడానికి సునీల్ రోజుకి రూ.4 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

'అమర్ అక్బర్ ఆంటోనీ'కి కూడా ఇదే రేంజ్ లో పారితోషికం అందుకున్నట్లు  తెలుస్తోంది. రీసెంట్ గా 'జెర్సీ' సినిమాలో నటించే అవకాశం వస్తే రెమ్యునరేషన్ దగ్గర సెటిల్ కాక ఆ సినిమాను వదులుకున్నట్లు సమాచారం. దీంతో చిత్ర నిర్మాతలు వెన్నెల కిషోర్ వంటి కమెడియన్లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వెన్నెల కిషోర్ కి రోజుకి రూ.2 లక్షలు పారితోషికం కావడంతో సునీల్ కి ఆల్టర్నేట్ గా వెన్నెల కిషోర్ ని తీసుకుంటున్నారు. 

'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా సక్సెస్ అయితే గనుక నిర్మాతలు సునీల్ ని తీసుకునే సాహసం చేయొచ్చు. ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం సునీల్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోక తప్పదు.