Asianet News TeluguAsianet News Telugu

దేవుడు పాత్రలో సునీల్...ఫ‌స్ట్‌లుక్‌ ఇదిగో

మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది.

Sunil as God in  Heads Tales movie
Author
Hyderabad, First Published Oct 9, 2021, 3:50 PM IST

ఒక టైమ్ లో హీరోగా తప్ప చేయనంటూ పట్టుబట్టి కూర్చున్న సునీల్ ఇప్పుడు ట్రాక్ మార్చారు. తనకు నచ్చే పాత్ర ఏదైనా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన దేవుడు అవతారం ఎత్తుతున్నారు. అయితే ఓటీటి కోసం .   ‘హెడ్స్ అండ్ టేల్స్’ టైటిల్ తో రూపొందే ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమాలో శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో  నటించారు’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా.  
  

'హెడ్స్ అండ్ టేల్స్'లో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. 'గాళ్ ఫార్ములా' యూట్యూబ్ ఛాన‌ల్‌లో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న శ్రీవిద్య-దివ్య ద్వయం మరోసారి ఈ సినిమాతో ప్రజల ముందుకొస్తున్నారు. 'హెడ్స్ అండ్ టేల్స్' గురించి మేకర్స్ మాట్లాడుతూ "ఇదొక అందమైన కథ. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కరూ జీవితంలో ఒక్కో దశలో ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. అప్పుడు విధిరాత ఎలా రాసి ఉంది? ప్రతి మహిళకు భాగస్వామి పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంది? అనేది కథ" అని చెప్పారు. 

దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి మాట్లాడుతూ "ఒక్క రాత్రిలో జరిగే కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' తెరకెక్కించాం. జీవితంలో వివిధ దశల్లో ఉన్న మహిళలు సమస్యలను పరిష్కరించే విధానం వేరుగా ఉంటుంది. మహిళల కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి మహిళకు స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం నిలబడాలని చెబుతుంది. ఇందులో జీవిత తత్వమూ ఉంది. మనం ఆలోచించే దానికంటే విధితో మన జీవితాలు ఎక్కువ ముడిపడి ఉన్నాయని చెప్పే చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా ఇది" అని అన్నారు. 

also read:పిల్లల కోసం తపించిన సమంత.. చైతూతో విడాకులకు ముందు అసలు ప్లాన్‌ అదేనట.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక 'జీ 5'. ఒక్క హిందీలో మాత్రమే కాదు...తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో 'జీ 5' ఉంటే చాలు... వినోదానికి లోటు ఉండదనే పేరు తెచ్చుకుంటోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios