సునిల్,ఎన్.శంకర్ 2 కంట్రీస్ మూవీ రివ్యూ

First Published 29, Dec 2017, 2:51 PM IST
sunil 2 countries movie review
Highlights
  • టైటిల్ : 2 కంట్రీస్
  • జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్
  • తారాగణం : సునీల్, మనీషా రాజ్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, 30 ఇయర్స్ పృథ్వీ
  • సంగీతం : గోపీ సుందర్‌
  • నిర్మాత, దర్శకత్వం : ఎన్. శంకర్
  • ఆసియానెట్ రేటింగ్ : 3/5

కథ :
బాధ్యత లేకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నించే పల్లెటూరి కుర్రాడు ఉల్లాస్ (సునీల్). తను డబ్బు సంపాదించటం కోసం ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంటాడు. అలా పటేల్ అనే రౌడీ దగ్గర తను తీసుకున్న అప్పును తీర్చలేక రెండు కాళ్లు లేని వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అదే సమయంలో ఫారిన్ లో సెటిల్ అయిన తన చిన్ననాటి  స్నేహితురాలు లయ (మనీషా రాజ్)తో పరిచయం అవుతుంది. ఆమెకు చెందిన కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలన్న ఆశతో పటేల్ కుటుంబం సంబంధం కాదని లయను పెళ్లి చేసుకుంటాడు.

చిన్నతనంలో అమ్మ నాన్నలు విడిపోవటంతో లయ మద్యానికి బానిసవుతుంది. ఉల్లాస్ అయితే తన అలవాట్లకు అడ్డురాడన్న నమ్మకంతో అతడితో పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే పెళ్లి తరువాత లయ గురించి నిజం తెలుసుకున్న ఉల్లాస్, లయతో చెడు అలవాట్లు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. లయ గతం తెలుసుకొని ప్రేమతో ఆమెను మామూలు మనిషిని చేయాలనుకుంటాడు. ఉల్లాస్ ప్రేమను లయ అర్థం చేసుకుందా..? ఈ ప్రయత్నంలో ఉల్లాస్ ఎలాంటి ఇబ‍్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ.

 

విశ్లేషణ :
మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగు ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించటంలో దర్శకుడు ఎన్.శంకర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. పక్కా డైరెక్షన్ తో సినిమాలో కథనాన్ని నడిపించిన శంకర్... సునీల్ నుంచి రాబట్టుకోవాల్సిన అన్ని రసాలను పర్ ఫెక్ట్ గా రాబట్టాడని చెప్పాలి. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలను సినిమాకు బాగా ప్లస్ అయ్యేలా చూసుకున్నాడు. గోపిసుందర్ సంగీతం విషయానికొస్తే పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట‍్టుకుంటుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి. పల్లెటూరి అందాలతో పాటు ఫారిన్ లొకేషన్స్ ను కూడా చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి వుంటే మరింత పర్ఫెక్షన్ వచ్చేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఆరాటపడుతున్న సునీల్, 2 కంట్రీస్ సినిమా విజయం కోసం తనవంతు ప్రయత్నం చేశాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సెంటిమెంట్ సీన్స్ లోనూ సునీల్ నటన ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా మనీషా రాజ్ మంచి నటన కనబరిచింది. మద్యానికి బానిసైన పొగరుబోతు అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగుంది. ఇతర పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, నరేష్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

చివరగా: 

సునీల్ ను అభిమానించే వాళ్లకు, కామెడీ ఇష్టపడే వాళ్లకు పక్కాగా నచ్చే 2 కంట్రీస్

loader