తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుడు సునీల్. ఆయన హీరో అవతారం ఎత్తి ఎన్ని సినిమాలు చేసినా కమిడియన్ గానే ఆయన్ని అభిమానులు గుర్తిస్తారు. రీసెంట్ గా విలన్ గా అవతారమెత్తి.. రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలోనూ...ఇటీవల ఓటీటీ లో విడుదలై విజయం సాధించిన కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు సునీల్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పుడు ‘కనబడుట లేదు’ అంటూ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సునీల్. తాజాగా ఈ సినిమానుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.  ఈ క్రైం థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీ సంస్థ విడుదల చేయనుంది.  ఈ చిత్రానికి ఎమ్‌. బాల‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో, స‌తీష్ రాజు, దిలీప్ కూర‌పాటి, దేవి ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సుక్రాంత్ వీరెల్ల‌, శ‌శిత కోన‌, యూగ్రామ్ త‌దితరులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రైవేట్ ఐ పేరుతో ఓ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. 

ఈ సినిమాలో సునీల్ డిటెక్టివ్ పాత్ర‌లో డిటెక్టివ్ రామ‌కృష్ణ గా క‌నిపించ‌నున్నారు. ఈ టీజ‌ర్‌లో ఓ కేసును చేధించడానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఓ చీక‌టి గదిలో భూత‌ద్దంతో ఏదో క‌నిపెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు సునీల్ క‌నిపించాడు. ఇక  ఈ చిత్రానికి అందించిన నేప‌థ్య సంగీతం ఎంతో అల‌రిస్తోంది. ఇక ఈ కామెడీ క్రైం థ్రిల్ల‌ర్‌ను స్పార్క్ ఓటీటీ సంస్థ ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తుంది.