యంగ్ హీరో  సందీప్‌ కిషన్ హిట్..ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కొత్త కథాంశంతో మెప్పించే ప్రయత్నం చేస్తూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సందీప్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ‌అన్య సింగ్‌  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. 

సందీప్‌ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం విశేషం. వెంకటాద్రి టాకీస్‌, వి స్టూడియోస్,‌ విస్తా డ్రీమ్‌ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

జూలై 12 న సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు.  హారర్ కలగలిపిన థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కింది.  పోసాని, మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : పికె వర్మ, ఎడిటింగ్ : ప్రవీణ్ కెఎల్, సంగీతం : ఎస్ఎస్ థమన్, ఆర్ట్ : విదేష్, స్టంట్స్ : వెంకట్.