ఈమధ్య వరుస ప్లాప్ లతో డీలా పడ్డాడు యంగ్ హీరో సందీప్ కిషన్. తన తోటి హీరోలు దూసుుకుపోతుంటే తను మాత్రం వెనుక పడ్డాడు. ఇక ఈసారి గట్టిగ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. మైఖేల్ అవతారం ఎత్తాడు. సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మైఖైల్ న్యూ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. 

ఈమధ్య వరుస ప్లాప్ లతో డీలా పడ్డాడు యంగ్ హీరో సందీప్ కిషన్. తన తోటి హీరోలు దూసుుకుపోతుంటే తను మాత్రం వెనుక పడ్డాడు. ఇక ఈసారి గట్టిగ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. మైఖేల్ అవతారం ఎత్తాడు. సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మైఖైల్ న్యూ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. 

టాలీవుడ్ యంగ్ హీరోలు చాలా మందిలో ఈ మధ్య కాలంలో జోరు కాస్త తగ్గింది. అందులో అందరికంటే బాగా వెనకబడి ఉన్నాడు సందీప్ కిషన్. హీరోగా పెద్దగా వర్కైట్ అవ్వక.. నిర్మాతగా కూడా మారాడు సందీప్. మరో వైపున హీరోగాను ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఆమధ్య గల్లీరౌడీ పర్వాలేదు అనిపంచింది. కాని ఇంత వరకూ సాలిడ్ హిట్ కొట్టలేదు సందీప్. 

ఒక రకంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రేంజ్ లో సందీప్ కు హిట్ పడలేదనే చెప్పాలి. గల్లీ రౌడీ తరువాత ఇంత వరకూ సందీప్ నుంచి మరో సినిమా రాలేదు. లేట్ అయినా లేటెస్ట్ గా రావడానికి సందీప్ రెడీ అవుతున్నాడు. మైఖేల్ గా పలకరించడానికి వస్తున్నాడు సందీప్. లోన్డ్ బాడీతో సిక్స్ ప్యాక్ చూపించడానికి సై అంటున్నారు. ఈరోజు (మే7) సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మైఖేల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

Scroll to load tweet…

శ్రీనివాస సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాని రంజిత్ జైకోడి డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ తో పూర్తిగా యాక్షన్ లోకి దిగిపోయినట్టుగా చేతిలో గన్ తో సందీప్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. హిట్ కోసం ఫుల్ మేకోవర్ అయ్యాడు సందీప్. చాలా కాలం గ్యాప్ తీసుకున్నా.. ఈ గ్యాప్ లో తనను తాను గట్టిగా మార్చుకున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. 

ఈ సినిమాలో సందీప్ జోడీగా మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మూడు కీలకమైన పాత్రలలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి కోలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు.