హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది. చాలా ఇంట్రస్టింగ్ గా సాగిన ఈ ట్రైలర్ లో సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్ ని చూపించారు. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంట క్యూట్ గా ఉంది. 

 ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ టీమ్   క్లైమాక్స్ సీక్వెన్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇండియాలోని అతిపెద్ద హాకీ స్టేడియం అయిన పంజాబ్‌లోని మొహాలీ గ్రౌండ్‌లో ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను షూట్ చేసారు. హాకీ నేపథ్యంలో వచ్చిన రికార్డులు తిరగరాసిన షారుఖ్ ఖాన్ ‘చక్ దే’ సినిమాను ఇదే మైదానంలో చిత్రీకరించడం విశేషం.

 సందీప్‌ కిషన్‌ ఈ సినిమాకు సెంటిమెంట్‌ ఫాలో అయ్యారు. ఆయన సినీ కెరీర్‌లో హిట్‌గా నిలిచిన సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'. ఈ చిత్రంతో సందీప్‌కు హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రమే కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు బ్రేక్‌ ఇచ్చింది. కాగా ఇప్పుడు సందీప్‌ కొత్త సినిమాకు 'ఎ1 ఎక్స్‌ప్రెస్‌' అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నారు.