కోవిడ్ సెకండ్ వేవ్ దేశానికి మరో సంక్షోభంలా మారింది.  రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరత రోగుల మరణానికి కారణం అవుతుంది. దేశంలోని అనేక హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కావాల్సిన స్థాయిలో లేదు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఢిల్లీకి చెందిన డాక్టర్ సునీల్ సాగర్ మీడియాతో మాట్లాడారు. సదరు వీడియోపై సుస్మితా సేన్ స్పందించారు. 


ఇలాంటి విపత్కర పరిస్థితులలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం విచారకరం. ఢిల్లీలోని సదరు హాస్పిటల్ కి నేను కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ పంపించాలని అనుకుంటున్నాను. ముంబై నుండి ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్స్ ఎలా పంపవచ్చు... ఎవరైనా సమాచారం ఇచ్చి సహాయం చేయగలరు, అని సుస్మితా సేన్ ట్వీట్ చేశారు. 


ఈ ట్వీట్ వైరల్ కావడంతో పాటు సుస్మితా సేన్ పై నెటిజెన్స్ ప్రసంశలు కురిపించారు. అయితే ఓ నెటిజెన్ ముంబైలో కూడా ఆసుపత్రులు ఉన్నాయి. అలాంటిది మీరు ముంబై హాస్పిటల్ కి కాకుండా ఢిల్లీ హాస్పిటల్ కి ఆక్సిజన్ ఎందుకు దానం చేస్తున్నారని, ప్రశ్నించాడు. సదరు నెటిజెన్ ప్రశ్నకు సమాధానంగా ముంబై హాస్పిటల్స్ తో పోల్చుకుంటే ఢిల్లీ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంది. అందుకే ఢిల్లీ పంపిస్తున్నాను. వీలైతే మీరు కూడా సాయం చేయండి అంటూ నెటిజెన్ కి కౌంటర్ ఇచ్చారు.