టాలీవుడ్‌లో మళ్లీ రావాతో హిట్ కొట్టిన సుమంత్ తాజాగా.. ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ ‘ఎయిర్‌టెల్’కు చురకలు అంటించాడు. ఫోన్ నెట్‌వర్క్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమంత్.. ట్విట్టర్ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏర్పడుతున్న నెట్‌వర్క్ సమస్యలకు ‘కాల్ డ్రాపింగ్’ అని పేరు పెట్టినందుకు ఎయిర్ టెల్ నిర్వాహకులపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు సుమంత్. 


‘‘కాల్ డ్రాపింగ్ ఆర్ట్‌ను ప్రతి రోజు విజయవంతగా నిర్వహిస్తున్నారు. ఎయిర్‌టెల్‌కు అభినంద‌న‌లు.’’ అని సుమంత్‌ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. సుమంత్ చేసిన ఈ ట్వీట్‌ను మంచు ల‌క్ష్మి కూడా రీట్వీట్ చేయడం గమనార్హం. దీనిపై ఎయిర్‌టెల్ ప్రతినిధులు స్పందించినా.. కేవలం ఆయన ఫోన్ నెంబరును మాత్రమే అడిగి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో, సుమంత్ ఫాలోవర్లు కొందరు.. నెంబర్లు తీసుకోవడం మానేసి, కాల్ డ్రాపింగ్‌కు శాస్వత పరిష్కారం చూపాలని డిమాండు చేశారు.