చాలా గ్యాప్ తర్వాత 'మళ్ళీరావా'  సినిమాతో మళ్లీ   ఫాంలోకి వచ్చిన హీరో  సుమంత్. ఆ సినిమా విజయం తో కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలు ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.  రీసెంట్ గా సుబ్రమణ్యపురం చేసారు. ఇప్పుడు  మరో డిఫరెంట్‌ మూవీ ఇదం జగత్ చేస్తున్నారు. అంజు కురియన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని  విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై...క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇది ఈ సినిమా బిజినెస్ కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. సుబ్రమణ్య పురం ట్రైలర్ బాగుండి..సినిమా బాగోలేకపోవటంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లైంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. నిర్మాతలు బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చేలా పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ...‘నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారును పూర్తిచేసి చిత్రాన్ని ప్రేక్షకు ల ముందుకు తీసుకొస్తాం. ప్రామిసింగ్ చిత్రాల హీరో  సుమంత్ ఈ చిత్రంలో  కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంద’ని తెలిపారు.