Asianet News TeluguAsianet News Telugu

దుల్కర్ సినిమాలో సుమంత్..క్యారక్టర్ ఏంటంటే

క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి సిద్దపడుతున్నారు. ఆ క్రమంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కీ రోల్ చేయటానికి సైన్ చేసారని సమాచారం. 
 

Sumanth plays a role in Dulquer Salmaans film jsp
Author
Hyderabad, First Published Jul 13, 2021, 12:10 PM IST

సీనియర్ నటుడు సుమంత్ తన కెరీర్ మొదలెట్టి చాలా కాలం అయ్యినా ఇప్పటిదాకా సరైన సూపర్ హిట్ పడలేదు. అప్పుడెప్పుడో సత్యం, మూడేళ్ల క్రితం మళ్లీ రావా సినిమాలు తప్పిస్తే చెప్పుకోదగ్గవి లేవు. అయితే ఎప్పుడూ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటున్నాడు. దాంతో ఇది కాదు పద్దతి అని క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి సిద్దపడుతున్నారు. ఆ క్రమంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కీ రోల్ చేయటానికి సైన్ చేసారని సమాచారం. ఆ పాత్ర ఓ సైనికుడుది అని, అతను దుల్కర్ లవ్ స్టోరీకు హెల్ప్ చేస్తాడని, సెకండాఫ్ లో చనిపోతాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఎంతవరకు అందులో నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
 
ఓకే బంగారం, మ‌హాన‌టి, క‌నులు క‌నుల‌ను దోచాయంటే వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌తో తెలుగులో కూడా మంచి గుర్తింపు ద‌‌క్కించుకున్న హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా  ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన కాన్సెప్ట్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

 ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ సెట్ వేసి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. . ఈ సినిమాలో దుల్కర్ స్నేహితుడిగా కీలక పాత్రలో సుమంత్ నటించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 1964 బ్యాక్ డ్రాప్ లో సాగే ఆర్మీ – లవ్ స్టోరీ ఇది.  రొమాంటిక్‌ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల చేయబోతున్నట్లు టాక్‌. 
 
డైరక్టర్ విషయానికి వస్తే... ‘అందాల రాక్షసి’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి ఆ తరువాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ రెండు చిత్రాల తరువాత ఆయన తెరకెక్కించిన ‘లై’, ‘పడి పడి లేచే మనసు’ ఫ్లాప్‌లు అవ్వడంతో.. ఈ దర్శకుడు కాస్త డీలా పడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios