కెరీర్ ప్రారంభం నుంచి చెప్పుకోదగ్గ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు సుమంత్ అశ్విన్. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు కుమారుడుగా టాలీవుడ్ లో ప్రవేశించిన సుమంత్ సరైన స్క్రిప్టులు పడకపోవటంతో సరైన సక్సెస్ ని అందుకోలేదు. 

వరస పెట్టి పరాజయాలు పలకరిస్తూండటంతో ఆయన కెరీర్ మరీ దారుణంగా తయారైంది. అయితే తాజాగా ఆయన చేసిన  ‘ ప్రేమకథా చిత్రమ్-2’ మాత్రం కాస్త చెప్పుకోదగ్గ బిజినెస్ జరిగి రిలీఫ్ ఇచ్చిందిట. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిసి కోటిన్నర వచ్చిందిట. దాంతో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారట. 

ఎందుకంటే బడ్జెట్ కూడా ఆ అంకెను దాట లేదట. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు జరిగే బిజినెస్ లో ప్రతీ పైసా లాభం క్రింద లెక్కే అంటున్నారు. అసలు సుమంత్ అశ్విన్ పేరు చెప్తే బిజినెస్ కావటం చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్దితుల్లో ఈ లెక్కలు ఊరటనిచ్చేవే. రేపు సినిమా కనుక ఆడితే ...ఒడ్డున పడిపోతారు. 

ఇక ఈ మాత్రం బిజినెస్ జరుగుతోందని తెలిస్తే చిన్న నిర్మాతలు క్యూ కట్టేస్తారు సుమంత్ అశ్విన్ చుట్టూ. అయితే ఏదో బిజినెస్ కోసం వచ్చే ఇలాంటి నిర్మాతల వల్ల కెరీర్ కు కొద్దిగా కూడా ఉపయోగం ఉండదనేది నిజం. కాబట్టి సుమంత్ అశ్విన్ ..కాస్త ఇప్పటికైనా మేల్కొని సరైన దర్శకులను, స్క్రిప్టులను ఎంచుకుంటాడని ఆశిద్దాం. 

ఇక సుదీర్ బాబు, నందితా కలిసి నటించిన ప్రేమ కధా చిత్రమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక రేంజ్ లో పేలింది. ఒ సుదీర్ బాబు క్రేరిర్లో మంచి హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు, అయితే ఈ మూవీ కి త్వరలోనే ‘ ప్రేమకథా చిత్రమ్-2’  సీక్వెల్ రాబోతుంది. కొత్త డైరెక్టర్ హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ ప్రేమకథా చిత్రమ్-2’ ఈ టైటిలే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.