సుమంత్‌ మరోసారి `అనగనగా రౌడీ` పేరుతో ప్రయోగం చేయబోతున్నారు. ఇందులో పూర్తిగా డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. నేడు(మంగళవారం) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా `అనగనగా రౌడీ` చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. 

సుమంత్‌ మరోసారి మాస్‌ రోల్‌ చేయబోతున్నారు. కెరీర్‌ బిగినింగ్‌లో మాస్‌ సినిమాలతో విజయాలు అందుకున్నారు. `గౌరీ`, `సత్యం` వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ప్రేమ కథలు, ఫ్యామిలీ సినిమాలు చేశారు. మధ్యలో అడపాదడపా మాస్‌ కథతో కూడిన సినిమాలు చేసినా మెప్పించలేకపోయాడు. మరోసారి ఇప్పుడు `అనగనగా రౌడీ` పేరుతో ప్రయోగం చేయబోతున్నారు. ఇందులో పూర్తిగా డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. నేడు(మంగళవారం) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా `అనగనగా రౌడీ` చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. 

ఇందులో మాస్‌లుక్‌లో సుమంత్‌ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో ఆయన వాల్తేరు శీనుగా కనిపించబోతున్నారు. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఏక్‌దో తీన్‌ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్‌, డా.టీఎస్‌ వినీత్‌భట్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మను మాట్లాడుతూ, `సుమంత్‌ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ మూవీ అని, ఆయన పాత్ర రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర కచ్చితంగా నచ్చుతుందన్నారు. వాల్తేరు శీనుగా, విశాఖపట్నంగా రౌడీగా ఆయన కనిపించబోతున్నారు. రౌడీగా ఆయన నటన కట్టిపడేస్తుంది. వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది` అని చెప్పారు దర్శకుడు. ఇందులో ఐమా నాయికగా నటిస్తుండగా, మార్క్.కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. 

View post on Instagram

ప్రస్తుతం సుమంత `కపటదారి` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈ నెల 19న విడుదల కాబోతుంది. `మళ్లీరావా` తర్వాత సుమంత్‌కి సక్సెస్‌ లేదు. ఈ చిత్రంతోనైనా హిట్‌ అందుకుని పూర్వవైభవాన్ని పొందుతారేమో చూడాలి.