మోహన్ లాల్ తాాజా చిత్రం ‘ వెలిపడింతె పుస్తకం’ బాగా పాపులరైన  ‘జిమ్మిక్కి కమ్మల్’ పాట జిమ్మిక్కి కమ్మల్ పాటకు స్టెప్పులేసిన సుమ

ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ వెలిపడింతె పుస్తకం’. ఈ సినిమాలోని ‘ జిమ్మిక్కి కమ్మల్’ అనే పాట ఇటీవల విడుదలవై విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అటు మళయాళంతోపాటు.. తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న ఈ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ పాటకు క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే.. ఆ పాటకు కొందరు స్టూడెంట్స్.. డ్యాన్స్ చేసి యూట్యూబ్ లో పెట్టగా.. 18లక్షల మంది వీక్షించారు.

కేరళ సాంప్రదాయ పండుగ ఓనమ్ సందర్భంగా.. విద్యార్థులు ఈ పాటకు డ్యాన్స్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇక మన తెలుగు బుల్లితెర ఫేమస్ యాంకర్ సుమ కూడా ఈ పాటకు డ్యాన్స్ వేసింది. పేరుకు మళయాళీ అయిన సుమ.. అచ్చమైన తెలుగు అమ్మాయిలా మన అందరికీ సుపరిచితమే. ‘జిమ్మికి కమ్మల్' అంటూ సాగే ఆ పాటకు సుమ తన చెవి కమ్మలను చూపిస్తూ డ్యాన్స్ చేస్తోంది. ఈ పాట తనను కూడా ఉర్రూతలూగిస్తోందంటూ సుమ చెప్పుకొచ్చారు. కోటికి పైగా వ్యూస్ దాటిన ‘జిమ్మికి కమ్మల్‌' పాటకు సుమ స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. తను డ్యాన్స్ చేసిన వీడియోని ఫేస్ బుక్ లో షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది. ఇప్పటి వరకు సుమను యాంకరింగ్, సింగర్ గా మాత్రమే చూశారు. ఇప్పుడు తనలోని ఈ కోణాన్ని కూడా చూడండి.