యాంకర్ గా.. ఎన్నో ఏళ్లు స్టార్ డమ్ తో దూసుకుపోతున్న సుమా కనకాల మరోసారి వెండితెరపై మెరుపులు మెరిపించబోతోంది. సుమ లీడ్ రోల్ చేసిన జయమ్మ పంచాయితీ రిలీజ్ కు రెడీ అయ్యింది. 

హోస్ట్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతున్న సుమ కనకాల ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు డైరెక్ట్ చేసిన సినిమా జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్ పై రూపొందుతోన్న ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. 

ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. సమ్మర్లో వచ్చే పెద్ద సినిమాల మధ్య నలిగిపోకుండా సేఫ్ జోన్ చూసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది జయమ్మ పంచాయితీ. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు టీమ. 

విజయ్ కుమార్ కలివరపు డైరెక్షన్ లో.. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మించారు. ఆసక్తి కలిగించే పల్లెటూరి డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫస్ట్ నుంచీ ప్రమోషన్ల విషయంలో చురుగ్గా ఉన్నారు టీమ్. 

ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్ ను ఆవిష్కరించారు.

ఎవరికీ, దేనికీ లొంగనిస్ట్రాంగ్ వాయిస్ ఉన్న పక్కా పల్లెటూరి మహిళగా సుమ ఈ సినిమాలో నటించారు. యాంకర్ గ మంచి ఫాలోయింగ్ ఉన్న సుమ గతంలో కొన్ని సినిమాలు సీరియళ్లలో నటించింది. ఇక చలా కాలం తరువాత మళ్లీ లీడ్ రోల్ లో ఆమె సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.