Asianet News TeluguAsianet News Telugu

'వైల్డ్ డాగ్', 'సుల్తాన్' కలెక్షన్స్ రిపోర్ట్..ఏది బెస్ట్

గుడ్ ఫ్రై డే రోజు తెలుగులో రెండు సినిమాలు పోటి పడ్డాయి, కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ కాగా మరోటి కార్తి నటించిన సుల్తాన్ 

Sulthan Outperforms Nag Wild Dog jsp
Author
Hyderabad, First Published Apr 3, 2021, 5:57 PM IST

బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్న శుక్రవారం ...గుడ్ ఫ్రై డే రోజు తెలుగులో రెండు సినిమాలు పోటి పడ్డాయి, కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ కాగా మరోటి కార్తి నటించిన సుల్తాన్ సినిమా. ఒకటి ఎక్స్ పెరి మెంటల్ మూవీ మరోటి పక్కా కమర్షియల్ మూవీ. అయినా కానీ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వేటి రేంజ్ లో అవి ఓపెన్ అవ్వగా ఇద్దరు హీరోలు కూడా ప్రీవియస్ మూవీస్ ఫ్లాఫ్స్ కాబట్టి ఆ ఇంపాక్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ విషయం లో కనిపించింది.

 కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి రెండు సినిమాలు బాగానే పుంజుకున్నాయి. ముఖ్యంగా నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా మొదటి రెండు షోలు కూడా నార్మల్ గానే ఉన్నప్పటికీ టాక్ మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవ్వడం తో ఈవినింగ్ షోలకు మంచి గ్రోత్ నే సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా పర్వాలేదు. ఈ నేపధ్యంలో ఈ రెండు చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ , ఓపినింగ్స్ చూద్దాం. 

వాస్తవానికి రెండు సినిమాల్లోనూ దేనికీ కూడ పూర్తిస్థాయి పాజిటివ్ టాక్ అయితే లేదు.  వైల్డ్ డాగ్ యావరేజ్ అంటున్నా కలెక్షన్స్ కనపజటం లేదు. ఇక  సుల్తాన్ ఫ్లాఫ్ అనే టాక్ ఉంది.  ఇక ఈ సినిమాల ఓపెనింగ్స్ విషయానికొస్తే వైల్డ్ డాగ్ కొంత నిరసపరచగా సుల్తాన్ బెటర్ పెర్ఫార్మెన్స్ చూపింది.  

వైల్డ్ డాగ్ విషయానికి వస్తే...

ఏరియా               కలెక్షన్స్ (కోట్లలో)
 
నైజాం                            0.51

సీడెడ్                            0.18

నెల్లూరు                          0.04

కృష్ణా                              0.08

గుంటూరు                        0.07

వైజాగ్                             0.15

ఈస్ట్                               0.07

వెస్ట్                                0.06

టోటల్ ఏపీ & టీస్ షేర్         1.16
 
సుల్తాన్ వసూళ్ల విషయానికి వస్తే నైజాం 42 లక్షలు, సీడెడ్లో 18 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 లక్షలు, ఈస్ట్ 10 లక్షలు, వెస్ట్ 7.3 లక్షలు, గుంటూరు 10 లక్షలు, నెల్లూరు 5.2 లక్షలు, కృష్ణ 11.5 లక్షలు కలిపి 1.17 కోట్ల షేర్ రాబట్టింది.  కార్తి కెరీర్లో తెలుగునాట ఇదే సెకండ్ హయ్యస్ట్ ఓపెనింగ్ అని చెప్తున్నారు. మరి రెండు సినిమాలు అంచనాలను మించుతాయా లేక ఇదే రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తాయో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios