సుకుమార్ ఆలోచన విధానం ఒక యువ దర్శకుడిపై గట్టిగానే ప్రభావం చూపుతోంది. అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఆ సినిమాకు ప్రొడ్యూసర్. అయితే ఐకాన్ ప్రాజెక్ట్ కంటే ముందే సుక్కు చెప్పిన లైన్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆప్రాజెక్ట్ ఫుల్ స్క్రిప్ట్ మొన్న రెడీ అయ్యింది. 

స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ముందుగా నాలుగు నెలల సమయం తీసుకున్న సుక్కు ఐకాన్ చిత్ర యూనిట్ కారణంగా ఒక నెలలో ఫినిష్ చేశాడట. దిల్ రాజు గత కొన్నాళ్లుగా బన్నీతో ఐకాన్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలనీ అనుకున్నాడు. సుకుమార్ ప్రాజెక్ట్ ఫుల్ గా రెడీ కాలేదు కాబట్టి ఐకాన్ ను మొదలుపెట్టాలని దిల్ రాజు బన్నీని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న సుకుమార్ ఓకే నెలలో ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. బన్నీని ఇప్పుడు దిల్ రాజుకి వదిలేస్తే మళ్ళీ దొరకడం కష్టమని షూటింగ్ కి రెడీ అయ్యాడు. 

సెప్టెంబర్ లో సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహకాలు చేస్తున్నాడు. దీంతో ఐకాన్ షూటింగ్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి సుకుమార్ స్పీడుకు డైరక్టర్ వేణు శ్రీరామ్ మరో ఆరు నెలలు ఓపిక పట్టక తప్పేలా లేదు. బన్నీ ఓ వైపు త్రివిక్రమ్ తో వర్క్ చేస్తూనే ఈ దర్శకులతో వర్క్ చేయాలనీ అనుకున్నాడు. కానీ అనుకోని విధంగా ఓక దాని తరువాత మరొకటి సెట్స్ పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.