టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ ఓ పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోపక్క తన సహాయకులను ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సుకుమార్ రైటింగ్స్ అంటూ ఓ బ్యానర్ మొదలుపెట్టి దాని ద్వారా తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డైరెక్టర్లకు అవకాశాలు కల్పిస్తున్నాడు.

తాజాగా సుకుమార్ రెండు ప్రాజెక్ట్ లు పట్టాలెక్కించడానికి ప్లాన్ చేశారు. అందులో ఒకటి నాగశౌర్య హీరోగా శరత్ మరార్ నిర్మాతగా చేయనున్నారు. ఈ సినిమా కంటే ముందుగా గీతాఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థలో సూర్యప్రతాప్ దర్శకుడిగా నితిన్ హీరోగా సినిమా చేయాలనుకున్నాడు. 

నితిన్ కూడా దానికి సై అన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ స్వయంగా చేయడం లేదా, వేరే బ్యానర్ లో చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీనికి కారణం ఏంటని ఆరా తీయగా.. సుకుమార్ సిద్ధం చేసిన కథ అల్లు అరవింద్ కి నచ్చలేదట.

ఆ విషయం సుకుమార్ కి చెప్పడం ఇష్టంలేక ఈ ప్రాజెక్ట్ ఊసెత్తడం మానేశారట. దీంతో ఈ ప్రాజెక్ట్ ని తానే సొంతంగా చేసుకోవాలని సుకుమార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.