డైరక్టర్స్ తమ షూటింగ్ లు, షెడ్యూల్స్ తో బిజీగా ఉంటే వాళ్ల భార్యలకు బోర్ కొట్టదూ. అందుకేనేమో వాళ్లూ తమదైన శైలిలో బిజినెస్ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. కాలక్షేపానికి కాలక్షేపం, డబ్బుకు డబ్బు...సంపాదిస్తూ బిజిగా ఉంటున్నారు. ఇప్పటికే  సూపర్ స్టార్  మహేష్ భార్య నమ్రత, రామ్ చరణ్ భార్యా ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి,దర్శకుడు శ్రీనువైట్ల భార్య ‘వేదిక్’ మిల్క్ పేరుతో రకరకాల ఆర్గానిక్ మిల్క్ ప్రాడక్ట్ బిజినెస్ కొనసాగిస్తోంది.

వీరంతా తమకు నచ్చిన  బిజినెస్ ల్లో ప్రవేశించి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా వీరి జాబితాలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత కూడా జాయిన్ అయింది. ఈ మేరకు ఆమె ఇన్స్ట్రగ్రమ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం  తబిత... మరో ముగ్గురు పార్టనర్లతో కలిసి 'లాండ్రీకార్ట్'(Laundrykart) అనే సంస్థను స్థాపించారు. ప్రీమియం సూట్స్ , ఖరీదైన చీరలు వాషింగ్ కు సంబంధించిన ఈ లాండ్రీ మార్ట్ ఒక ప్రముఖ సంస్థ ప్రాంఛైజ్ కావటం విశేషం. ఇప్పటికే హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ.. మియాపూర్.. లాంకో హిల్స్ లాంటి ఏరియాలలో ఆఫీసులు ఓపెన్ చేసారు.

ఈ సంస్థ ప్రారంభిస్తూనే హైదరాబాద్ లో ఏకంగా మూడు చోట్ల బ్రాంచ్ లు పెడుతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  ఈ సంస్ద  ఖరీదైన దుస్తులను ఉతకడం.. ఇస్త్రీ చేయడం.. డ్రై క్లీనింగ్ చేయడం లాంటి సర్వీసులను అందిస్తుంది. ఈ సేవలను ఒక యాప్ ద్వారా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.