ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 17) రిలీజ్ అయ్యింది పుష్ప(Pushpa) పార్ట్ 1 మూవీ. ఎన్నో ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు థియేటర్లకు చేరిన పుష్ప పర్వాలేదనిపిస్తుంది. ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 హట్ టాపిక్ అవుతుంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arajun)- రష్మిక మందన్న(Rashmika) జంటగా.. జీనియస్ డైరెక్టర్ సుకుమర్ (Sukumar) తెరకెక్కించిన సినిమా పుష్ప(Pushpa). రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈమూవీ పార్ట్ 1 ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆర్య,ఆర్య2తో సూపర్ సక్సెస్ కొట్టిన సుకుమార్- బన్ని కాంబినేషన్.. పుష్పతో హ్యాట్రిక్ హిట్ పై కన్నేశారు. 


పుష్ప(Pushpa)ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు సినిమాలు చేయాలి అని ముందు అనుకోకపోయినా.. సినిమాను కరెక్ట్ గా.. ఆడియన్స్ కు కన్వే అయ్యేలా కథను ప్రజంట్ చేయాలి అంటే.. రెండు సినిమాలు అయితేనే బెస్ట్ అనుకున్నారు Sukumar. అయితే ఫస్ట్ పార్ట్ మూవీని "పుష్ప: ది రైజ్" రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు పుష్ప పార్ట్2 ని ఎలా చూపిస్తారా అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఉంది. 


వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న పుష్ప పార్ట్ 2కి ఏ పేరు పెడతారో అన్న ఆసక్తి మూవీ లవర్స్ తో పాటు బన్ని అభిమానులలో కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్ 2 టైటిల్ ను రివిల్ చేశారు డైరెక్టర్ సుకుమర్. పుష్ప పార్ట్ 1 మూవీ ఎండింగ్ లో ఈ టైటిల్ హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ ను పుష్ప: దిరైజ్( Pushpa The Rise) గా తెరకెక్కిస్తే.. పుష్ప పార్ట్ 2ను పుష్ఫ: ది రూల్ (Pushpa the Rule) టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Also Read : PUSHPA- KGF: ఆ విషయంలో KGF హిట్ అయితే.. పుష్ప మాత్రం ఫట్ అయ్యింది... ఎందుకు...?


పుష్ప పార్ట్ 1 మూవీ ప్రమోష్స్, రిలీజ్ విషయంలో హడావిడి జరిగింది. చేయాలనుకున్నంత వర్కౌట్ చేయలేకపోయారు. ఈసారి పుష్ప పార్ట్ 2 విషయంలో మాత్రం అది రిపిట్ కాకుండా జాగ్రత్తగా అడుగులువేయాలని చూస్తున్నారు టీమ్. అంతే కాదు పుష్ప పార్ట్ 1 ను మించి.. పార్ట్ 2 లో డోస్ పెంచే ఆలోచనలో ఉన్నారు. పుష్ప ది రైజ్‌తోనే మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగిస‍్తున్న బన్నీ సెకండ్‌ పార్టులో తన రూలింగ్‌తో ఇంకెంత హడావిడి చేస్తాడో చూడాలి. 

Also Read : Pushpa Review:అల్లు అర్జున్‌ ‘పుష్ప - ది రైజ్‌’ రివ్యూ