సుకుమార్ కు బెస్ట్ విషెష్ చెప్తూ మహేష్ బాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ట్వీట్ సైటైర్ చేసిందంటూ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే అటు సుకుమార్ కానీ, మైత్రీ మూవీస్ బ్యానర్ కానీ అల్లు అర్జున్, సుకుమార్ కాంబో గురించిన ప్రకటన చెయ్యలేదు.  అయినా మహేష్ ...విషెష్ చెప్పారు. అది సుకుమార్ కు డైరక్ట్ గా ఫోన్ చేసి చెప్పచ్చు కానీ మహేష్ కు మండే అలా చేసాడని చెప్పుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో సుకుమార్ ఇప్పుడు సూప్ లో పడ్డారు. మహేష్ ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియాలో సుకుమార్ ని ఎందుకు ప్రాజెక్టు ఆగిందంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే సుకుమార్ తో సినిమా ఆగిపోవటమే మంచిదని, అనీల్ రావిపూడి తో ప్రాజెక్టు స్టార్ట్ అవటమే బెస్ట్ అని 1 నేనొక్కిడినే సినిమాని గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో సుకుమార్ మౌనం వదిలి ...అందరికి ఒకే సమాధనం చెప్దామనుకుంటున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ చేద్దామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ వివాదం సెగ అల్లు అర్జున్ కు కూడా తగులుతోంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్ని కి సైతం రిటార్ట్ లు ఇస్తున్నారు.

ఇలా జరగటం వెనక అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ  కండిషన్స్ లో సుకుమార్ వాతావరణాన్ని తేలిక పరచటానికి భాధ్యత తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా పరిశ్రమలో క్రియేటివ్ డిఫెరెన్స్ లు రావటం అనేది సహజమనేది అందరి మాట.