ఒక ముసలమ్మను మోసం చేసిన సుకుమార్

First Published 10, May 2018, 5:16 PM IST
Sukumar about mahanati incident
Highlights

ఒక ముసలమ్మను మోసం చేసిన సుకుమార్

సావిత్రి జీవన చిత్రం ‘మహానటి’ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. కీర్తి సురేష్ పెర్ఫామెన్స్‌నీ, నాగ్ అశ్విన్ డైరెక్షనల్ టాలెంట్‌నీ అదే పనిగా పొగిడేస్తోంది టాలీవుడ్ ప్రపంచం. వైజయంతీ బేనర్ ప్రతిష్టను ఇనుమడింపజేసిందంటూ.. అలనాటి దిగ్గజాలు సైతం ‘మహానటి’ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇదే కోవలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒక విశిష్టమైన కాంప్లిమెంట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్‌కి. ‘మహానటి’ సినిమా చూసి బైటికి వస్తుండగా.. ఒక పెద్దావిడ సుక్కు దగ్గరికొచ్చి ”నువ్వేనా బాబూ డైరెక్టర్‌వి” అంటూ దగ్గరికొచ్చి కౌగలించుకుని.. మనసారా ఆశీర్వదించింది. ‘నేను నువ్వులా మారిన ఆ నాలుగు క్షణాలూ అత్యంత అపురూపమైనవి.. నేను నువ్వు కాదని చెప్పకుండా నిశ్శబ్దంగానే అబద్ధమాడినందుకు క్షమిస్తావా’ అంటూ నాగ్ అశ్విన్‌‌ని లేఖాపూర్వకంగా వేడుకున్నాడు సుక్కు. ఇటీవలే సుకుమార్ కూడా ‘రంగస్థలం’ పేరుతో టాలీవుడ్‌కి మరో అపురూప కానుకనిచ్చిన సంగతి తెలిసిందే!

loader