నేడు జాక్వెలిన్ తన పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా జైల్లో ఉన్న సుకేష్.. జాక్వెలిన్‌కి ఓ లేఖ రాయడం విశేషం. అది మామూలు లేక కాదు లవ్ లెటర్.
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన జాక్వెలిన్ అనూహ్యంగా వివాదాల్లో ఇరుక్కుంది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది. హాట్ అందాలతో మంత్రముగ్దుల్ని చేసే ఈ భామ ఇంకా దాన్నుంచి బయటపడలేదు. మరోవైపు కేసుకి ప్రధాన కారకుడైన సుకేష్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ ఉంది. ఈ ఇద్దరు చాలా రోజులు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అందుకే ఆ కేసులో జాక్వెలిన్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది.
ఇదిలా ఉంటే నేడు జాక్వెలిన్ తన పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా జైల్లో ఉన్న సుకేష్.. జాక్వెలిన్‌కి ఓ లేఖ రాయడం విశేషం. అది మామూలు లేక కాదు లవ్ లెటర్. జాక్వెలిన్‌పై తనకున్న ప్రేమని ఆయన లెటర్ రూపంలో వెల్లడించారు. ఆ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ లేఖలో జాక్వెలిన్‌ని ప్రేమించకుండా ఆపడం ఈ గ్రహంలో ఏ శక్తికి సాధ్యం కాదంటూ ఆయన పేర్కొనడం ఆశ్చర్యపరుస్తుంది. అందుకే ఇది వైరల్‌గా మారింది.

మరి ఇందులో ఇంకా ఏం రాశాడనేది చూస్తే, నా బేబీ అంటూ స్టార్ట్ చేశాడు సుకేష్. `నా బేబీ జాక్వెలిన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా జీవితంలో ప్రతి ఏడాది నీ పుట్టిన రోజు అత్యంత ఇష్టమైన రోజు. నా బర్త్ డే కంటే కూడా ఎక్కువ. బేబీ నువ్వు రోజు రోజుకి మరింత అందంగా, యవ్వనంగా తయారవుతున్నావ్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. వచ్చే ఏడాది నీ పుట్టిన రోజును కలిసి జరుపుకుంటానని ఆశిస్తున్నా. ఈ గ్రమంలోని ఏ శక్తి నిన్ను ప్రేమించకుండా ఆపలేదు` అంటూ భావోద్వేగంతో కూడా లేఖని రాసుకొచ్చాడు సుకేష్ చంద్రశేఖర్. ఇదిప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో హగ్ చేసుకున్న విషయాలను, కేక్ తినిపించిన విషయాలను కూడా సుకేష్ పేర్కొన్నాడు.
అయితే గతంలోనూ ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ జాక్వెలిన్ వీటిని ఖండించింది. అంటే ఆమెని సుకేష్ లవ్ చేస్తున్నాడు కానీ, జాక్వెలిన్ కి ఇష్టం లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక `సాహో`లో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది జాక్వెలిన్. ఓ వైపు నటిగా యాక్షన్ చిత్రాలు చేస్తుంది. అలాగే ఐటెమ్ సాంగ్స్ లో రచ్చ చేస్తుంది. స్పెషల్ వీడియో సాంగుల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.
