బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ సాహో రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ డోస్ పెంచుతుండడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఇక ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకతో సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ను దర్శకుడు సుజిత్ ఇటీవల చెన్నై మీడియా సమావేశంలో బయటపెట్టాడు. సినిమా కథ అందరికి బాగా నచ్చుతుందని కాప్ గా కనిపించనున్న ప్రభాస్ పాత్ర సెకండ్ హాఫ్ సరికొత్త థ్రిల్ ఇస్తుందని అన్నారు. మెయిన్ గా ఎవరు ఊహించని ట్విస్ట్ అందరికి నచ్చుతుందని దర్శకుడు చెప్పాడు. 

దీంతో ప్రభాస్ ఏ విధంగా మారతాడో అని అందరిలో ఉంత్కంట నెలకొంది. సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.