యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ సాహో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే  సినిమాను నిర్మించిన యూవీ ప్రొడక్షన్ తో కలిసి ప్రభాస్ మల్టిప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మొదట నెల్లూరులోని సూళ్లూరు పేటలో 'వి ఎపిక్' పేరుతో మల్టీప్లెక్స్ ని నిర్మించారు.

అయితే ఈ మల్టిప్లెక్స్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. వేడుకలో సాహో దర్శకుడు సుజిత్ సైరా సినిమా గురించి మాట్లాడాడు. ముందుగా నా మొదటి సినిమాతో ఈ థియేటర్ మొదలవుతున్నందుకు  చాలా సంతోషంగా ఉందని చెబుతూ.. త్వరలో మెగాస్టార్ సైరా సినిమాను మీతో కలిసి ఇదే థియేటర్ లో చూస్తానని సుజిత్ వివరణ ఇచ్చాడు. 

అలాగే మెగాస్టార్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సుజిత్ సైరా నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ ని ఈ పెద్ద స్క్రీన్ లో చూడాలనుందని అభిమానులకు వివరించాడు. ఇక మెగాస్టార్ రామ్ చరణ్ ఈవెంట్ లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలని సాహో సినిమా తప్పకుండా అన్ని వర్గాల ఫ్యాన్స్ కి నచ్చుతుందని సుజిత్ వివరణ ఇచ్చాడు.