ప్రభాస్ కు నచ్చాడు..అది చాలు..మొత్తం సెట్ చేసాడు

సుజీత్ ఇప్పుడేం చేస్తున్నారు. తన తదుపరి చిత్రాన్ని ఏ దర్శకుడుతో చేస్తున్నాడు అంటే గోపీచంద్ తో అని తెలుస్తోంది. గోపీచంద్ తో జిల్ చేసిన రాధాకృష్ణ కుమార్..ప్రభాస్ తో రాధేశ్యామ్ చేస్తూంటే...ప్రభాస్ తో సినిమా చేసి ప్లాఫ్ ఇచ్చిన సుజీత్ గోపీచంద్ తో కమిటయ్యాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వెనక ప్రభాస్ ఉన్నాడని తెలుస్తోంది. సినిమా ఇక్కడ ఫ్లాఫ్ కావచ్చు కానీ బాలీవుడ్ మార్కెట్ ని నిలబెట్టిందనే ఆలోచనతో సుజీత్ కు ఈ ప్రాజెక్టుని సెట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని యువి క్రియోషన్స్ వారు నిర్మిస్తున్నారు.
 

Sujeeth next with Gopichand confirmed? jsp


తొలి చిత్రం రన్ రాజా రన్ తో హిట్ కొట్టిన సుజీత్ తర్వాత ప్రభాస్ తో చేసిన `సాహో`చిత్రం ఫ్లాఫ్ తో వెనకబడ్డారు. ఆ సినిమా తెలుగులో వర్కవుట్ కాకపోయినా హిందీలో బాగానే ఆడటం సుజీత్ కు కలిసివచ్చిందని,వరస ఆఫర్స్ వస్తాయని భావించారు.అయితే అలా జరగలేదు. ఎట్టకేలకు చిరంజీవి తన తర్వాత చిత్రం డైరక్ట్ చేసే అవకాసం ఇచ్చారు. మలయాళంలో హిట్టైన `లూసిఫర్`ను చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయటానికి రంగం సిద్దం చేసారు. ఆ రీమేక్ బాధ్యతలను సుజిత్‌కు  తీసుకుని స్క్రిప్టు వర్క్ చేసారు. తెలుగు వెర్షన్ కు తనదైన శైలిలో సీన్స్ రాసి నేరేషన్ వినిపించారు. అందుతున్న సమాచారం మేరకు చిరంజీవికు ఆ వెర్షన్ నచ్చలేదు. దాంతో అదీ వెనక్కి వెళ్లిపోయింది. 

ఆ తర్వాత హిందీ ఛత్రపతి రీమేక్ కు సుజీత్ ని పిలిచారని వినపడింది. అలాంటిదేమీ లేదని సుజీత్ ఖరారు చేసి చెప్పేసారు. మరి సుజీత్ ఇప్పుడేం చేస్తున్నారు. తన తదుపరి చిత్రాన్ని ఏ దర్శకుడుతో చేస్తున్నాడు అంటే గోపీచంద్ తో అని తెలుస్తోంది. గోపీచంద్ తో జిల్ చేసిన రాధాకృష్ణ కుమార్..ప్రభాస్ తో రాధేశ్యామ్ చేస్తూంటే...ప్రభాస్ తో సినిమా చేసి ప్లాఫ్ ఇచ్చిన సుజీత్ గోపీచంద్ తో కమిటయ్యాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వెనక ప్రభాస్ ఉన్నాడని తెలుస్తోంది. సినిమా ఇక్కడ ఫ్లాఫ్ కావచ్చు కానీ బాలీవుడ్ మార్కెట్ ని నిలబెట్టిందనే ఆలోచనతో సుజీత్ కు ఈ ప్రాజెక్టుని సెట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని యువి క్రియోషన్స్ వారు నిర్మిస్తున్నారు.
 
ఇక తొలినుంచీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పేరుతెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇప్పుడు కూడా అదే బాటలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీ మార్' చిత్రాన్ని చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. దీని తర్వాత గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్టు వరకు ఇప్పటికే యూవి క్రియోషన్స్ కు చెందిన వంశీ, ప్రమోద్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పూర్తి స్క్రిప్టు రెడీ చేసుకుని రీసెంట్ గా గోపీచంద్ కు నేరేషన్ ఇచ్చారట. అలా యూవి క్రియోషన్స్ సాయంతో సుజీత్..యుటర్న్ తీసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios