పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న `ఓజీ` సినిమా షూటింగ్ ఇప్పట్లో అయ్యేలా లేదు. దీంతో దర్శకుడు సుజీత్ మనసు మార్చుకున్నాడట. నానితో కమిట్ అయినట్టు టాక్.
దర్శకుడు సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో `ఓజీ` మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ దాదాపు 70శాతం షూటింగ్ పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ మూవీ వాయిదా పడింది. మరో 15రోజులు పవన్ డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుంది. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా అనుకుంటున్నారు. ఏప్రిల్‌లో ఏపీలో ఎన్నికలు అయిపోతే ఆ వెంటనే `ఓజీ`ని పూర్తి చేసి ఆగస్ట్ వరకు రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తుంది.
ఇదిలాఉంటే దీనికి సంబంధించిన కొత్త అప్ డేట్ వచ్చింది. దర్శకుడు సుజీత్ ఈ లోపు వేరే సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నారు. నానితో సినిమా చేయబోతున్నారట. మాఫియా నేపథ్యంలో సినిమాని అనుకుంటున్నట్టు సమాచారం. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయ్యిందని సమాచారం. దీన్ని కూడా డీవీవీ దానయ్య నిర్మించనున్నారని తెలుస్తుంది. `ఓజీ`కి కూడా ఆయనే నిర్మాత అనే విషయం తెలిసిందే.
అయితే నాని మూవీ `ఓజీ` తర్వాతనే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే నాని చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో `సరిపోదా శనివారం` సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత `బలగం` వేణుతో సినిమా చేయబోతున్నారు. మరోవైపు `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓడెలాతో ఓ సినిమా చేయాల్సింది. అలాగే త్రివిక్రమ్ కూడా ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో సుజీత్ మూవీ ఎప్పుడు ఉంటుందనేది పెద్ద సస్పెన్స్. లైన్ ప్రకారం దీనికి ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉందని చెప్పొచ్చు.
