సాహో ఫ్లాఫ్ తర్వాత సుజీత్ పరిస్దితి మారిపోయింది. అతనికి చిత్రంగా రీమేక్ ఆఫర్స్ మొదలయ్యాయి. స్ట్రైయిట్ కథలతో సినిమా చేద్దామనుకున్న సుజీత్ కు రీమేక్ ఆఫర్స్ రావటం కాస్త ఇబ్బందికర విషయమే. కానీ ఇక్కడ సక్సెస్ ప్రధానం. రన్ రాజా రన్ సినిమా సక్సెస్ తో సుజీత్ కు భారీ ఆఫర్ సాహో వచ్చింది. ఆ తర్వాత సాహో ఎఫెక్ట్ తో రీమేక్స్ మొదలయ్యాయి. సరైన కథ ఎంచుకోలేకపోయాడు కానీ మేకింగ్ బాగుంది అని పేరు తెచ్చుకోవటం కలిసొచ్చింది. అయితే అవేమీ వర్కవుట్ కాలేదు.

మొదట మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ బాధ్యత మొదట సుజీత్ కే అప్పచెప్పారు. ఆ విషయం ఆయనే అఫీషియల్ గా ప్రకటించారు.ఆ తర్వాత వినాయక్ కి ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరూ ఆ రీమేక్ డైరెక్ట్ చెయ్యట్లేదు. అది వేరే విషయం.  అలాగే, “ఛత్రపతి” హిందీ రీమేక్ కూడా చెయ్యాల్సిందిగా బాలీవుడ్ నిర్మాణ సంస్ద సుజీత్ ని సంపద్రించింది కూడా నిజమే. అయితే అది కూడా చేయట్లేదు. అదీ వినాయిక్ డైరక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా సుజీత్ వద్దనుకున్నవి వినాయిక్ దగ్గరకు రావటం యాధృచ్చికమే అయ్యిండవచ్చు. ఇక సుజీత్ తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.

“ఏ రీమేక్ చెయ్యట్లేదు,” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా పోస్ట్ చేశాడు. ఆ విధంగా తాను లూసిఫర్ రీమేక్ కానీ, ఛత్రపతి రీమేక్ కానీ తీయడం లేదని  తేల్చి చెప్పేసాడు. అదీ ఒకెందుకు మంచిదే.