‘సుధీర్ పదినిమిషాలు దడపుట్టించాడు’.. ‘కాలింగ్ సహస్త్ర’ టైటిల్ లోనే అసలు కథ?.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్
‘యానిమల్’తో పాటుగా సుడిగాలి సుధీర్ నటించిన ‘కాలింగ్ సహాస్త్ర’ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. భారీ చిత్రంతో వస్తున్న సుధీర్ ఈ చిత్రంతో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ప్రేక్షకులకు చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
బుల్లితెరపై కామెడీ పంచిన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ప్రస్తుతం హీరోగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడ్’ వంటి చిత్రాలతో అలరించారు. చివరిగా ‘గాలోడు’తో మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ప్రమోషన్స్ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలను సినిమాపై ఆసక్తిని పెంచాయి. టైటిల్ నుంచి సినిమా చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాలింగ్ అనేది కంపెనీ పేరని, సహస్ర అనేది హీరోయిన్ పాత్ర పేరు అని.. కాలింగ్ సహస్ర అనేది కథలోంచి పుట్టిందేనని చెప్పుకొచ్చారు. కథకు సరిగ్గా సెట్ అవ్వుద్దని ఈ టైటిల్ పెట్టామన్నారు. టైటిల్ కూ మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
అలాగే కాలింగ్ సహస్ర స్టార్ట్ అయిన తరువాత పది నిమిషాలకు సుధీర్ అనే వ్యక్తిని మీరు మరిచిపోతారు. ఆయన పోషించే పాత్రలోకి వెళ్తారు. పాత్రతో కనెక్ట్ అవుతారు. ఇందులో సుధీర్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించడు. ఇది ఓ ప్రయోగమే. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సుధీర్‌తో పాటుగా శివ బాలాజీ గారి పాత్ర, డాలీషా కారెక్టర్‌లకు మంచి పేరు వస్తుంది. డాలీషా ఓ ఫైట్ సీక్వెన్స్ చేసింది. ఫైట్ మాస్టర్ చూసి క్లాప్స్ కొట్టేశాడు.
ఈ సినిమా నిర్మాణానికి, రిలీజ్ కు నిర్మాతలు ఎంతో సహకరించారు. వారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. డిసెంబర్ 1న వస్తున్నామంటే దానికి కారణం కూడా వారే. ‘యానిమల్’తో పోటీగా రావడం లేదు.. యానిమల్‌తో పాటుగా వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా ట్విస్టులుంటాయి. ఆ ట్విస్టులు అందరికీ తెలిసినా కూడా థియేటర్‌కు వచ్చి చూస్తారు. ఇందులో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. ఇందులో నేరుగా సందేశం ఇవ్వం. కానీ అంతర్లీనంగా ఓ మెసెజ్ ఉంటుంది. ఇక చిత్రానికి మోహిత్ చక్కటి సంగీతం అందించారు. పాటలు మోహిత్ ఇవ్వగా.. ఆర్ఆర్ రాబిన్ మిగితా వర్క్ చూశారు. ఆర్ఆర్ గుర్తుండిపోతుంది.