బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. 'జబర్దస్త్', 'ఢీ' షోలతో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ నటుడు ఇప్పుడు హీరోగా మారాడు. 'ఢీ' షోలో హీరో రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చే సుధీర్ ని జడ్జిలు కూడా హీరోగా మారమని సలహాలు ఇచ్చేవారు.

ఇప్పుడు నిజంగా అతడు హీరోగా మారాడు. సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు హీరోగా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల అనే దర్శకుడు 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది.

పోసాని, షాయాజీ షిండే వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ... ''అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో వారికి మరింత దగ్గరయ్యే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.