సుడిగాలి సుధీర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. జబర్దస్త్ కమెడియన్ కాస్తా ఫిల్మ్ స్టార్ అయ్యాడు. ఆయన లేటెస్ట్ మూవీ గాలోడు నేడు థియేటర్స్ లో విడుదలైంది. ఈ క్రమంలో ఆయన రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.  

సుడిగాలి సుధీర్ జీవితం చాలా మందికి స్ఫూర్తి. తినడానికి తిండి, ఉండటానికి నీడ లేని పరిస్థితి నుండి రోజుకు లక్షలు సంపాదించే స్థాయికి సుధీర్ ఎదిగాడు. ఒక దశలో కుళాయిలో నీళ్లు తాగి రోడ్డు ప్రక్కన పడుకున్నట్లు సుధీర్ వెల్లడించారు. సుధీర్ కెరీర్ మెజీషియన్ గా మొదలైంది. అడపాదడపా షోస్ ఇస్తూ చాలీ చాలని సంపాదనతో కాలం వెళ్లదీస్తూ ఉండేవాడు. జబర్దస్త్ కి వెళ్లాలనే ఆలోచన తన ఫేట్ మార్చేసింది. 2013లో వెండితెర కమెడియన్స్ ధన్ రాజ్, షకలక శంకర్, టిల్లు వేణు, చమ్మక్ చంద్ర, రాఘవ, రఘు టీమ్ లీడర్స్ గా జబర్దస్త్ ప్రారంభమైంది. మొదట వారి టీమ్స్ లో సభ్యుడిగా సుధీర్ కి అవకాశం వచ్చింది. 

అక్కడ సుధీర్ మంచి పేరు తెచ్చుకున్నారు. సీనియర్స్ వెళ్లిపోవడంతో టీమ్ లీడర్ ఛాన్స్ దక్కింది. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ టీమ్ సభ్యులుగా దొరకడం సుధీర్ కి కలిసొచ్చింది. వారి కాంబినేషన్ లో సుడిగాలి సుధీర్ టీమ్ టాప్ పొజిషన్ కి వెళ్ళింది. జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్ అన్న పరిస్థితి వచ్చింది. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో సుధీర్ ఢీ యాంకర్ గా మారాడు. ఢీ వలన సుధీర్ ఇమేజ్ మరింత పెరిగింది. స్టార్ హోదా తెచ్చిపెట్టింది. 

బుల్లితెర స్టార్ కాస్తా సినిమా హీరో రేంజ్ కి ఎదిగాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ ఆయన హీరోగా తెరకెక్కిన ఫస్ట్ మూవీ. అలాగే తన ఇద్దరు మిత్రులతో కలిసి 3 మంకీస్ టైటిల్ తో ఒక మూవీ చేశాడు. మూడో ప్రయత్నంగా గాలోడు చిత్రం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి దర్వకత్వంలో గెహ్నా సిప్పీ హీరోయిన్ గా తెరకెక్కిన గాలోడు నేడు విడుదలైంది. గాలోడు మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నట్లు సమాచారం . 

ఎపిసోడ్ కి లక్షల్లో తీసుకుంటున్న సుధీర్ గాలోడు చిత్రానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే చర్చ నడుస్తుంది. గాలోడు మూవీ వరల్డ్ వైడ్ రూ. 2 నుండి 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సుధీర్ సినిమాకు ఇంత బిజినెస్ జరిగిందంటే మామూలు విషయం కాదు. ఈ మొత్తం వసూలు చేయగలితే సుధీర్ కి మార్కెట్ ఏర్పడినట్లే. కాగా సుధీర్ ఈ చిత్రానికి రూ. 40 నుండి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.