బుల్లి తెరపై నుంచి వెండితెరపై హీరోగా వెలగాలని కష్టపడుతూ వచ్చిన జబర్థస్త్ ఫేమ్ సుడిగాలిసుధీర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఏకంగా ప్రభాస్ డైరెక్టర్ తో హీరోగా సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడట.ఇంతకీ ఎవరా దర్శకుడు..
మెజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. జబర్థస్త్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సుడిగాలి సుధీర్. జబర్థస్త్ లో అంత మంది కమెడియన్స్ ఉన్నా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించాడు సుధీర్. ఇక జబర్థస్త్ లో యాంకర్ రష్మీతో ప్రేమాయణం సుధీర్ ను ఇంకా పెద్ద హీరోను చేసింది. బుల్లతెర హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు సుధీర్. సుధీర్ కోసం ప్రోగ్రామ్ చూసేవారు ఉన్నారు. సుధీర్ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించి.. ఆయన షోలు చూసేవారు ఉన్నారు. ఓవైపు యాక్ట్ చేస్తూనే మరోవైపు షోలకు యాంకరింగ్ చేస్తూ, ప్రేక్షకుల్ని గట్టిగా ఎంటర్ టైన్ చేశాడు.
మల్టీ టాలెంట్ హీరోగా తనను తానునిరూపించుకున్న సుధీర్.. రీసెంట్ గా గాలోడు మూవీతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈమధ్య టీవీ షోలు కూడా మానేసి.. హీరోగా నిలబడాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్. కొన్నాళ్ళుగా బుల్లితెరపై సందడి చేయకపోవడంతో.. ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇక ఇప్పుడేమో అదిరిపోయే క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. గాలోడు లాంటి మాస్ ఎంటర్ టైనర్ తో .. కాస్త బెటర్ కలెక్షన్స్ సాధించిన సుధీర్.. నెక్స్ట్ ఏ సినిమాతో వస్తాడా అని సుధీర ప్యాన్స్ ఎదరుచూస్తూ ఉన్నారు. ఈక్రమంలోనే ఓ న్యూస్..సుధీర్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసింది.
నిజానికి సుధీర్ ఇప్పుడు కాలింగ్ సహస్ర అనే మూవీ చేస్తున్నాడు. కానీ ఆసినిమానుంచి ఇంత వరకూ ఎటువంటి అప్డేట్స్ రాలేదు. అసలు షూటింగ్ ప్రాసెస్ లో ఉందా..? లేదా అనేది కూడా పెద్దగా తెలియదు. కాని సుధీర్ కు ప్రభాస్ డైరెక్టర్ దశరధ్ తో సినిమా ఫిక్స్ అయ్యిందని మాత్రం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ తో మిస్టర్ ఫెర్ఫెక్ట్ లాంటి హిట్ కొట్టిన దశరథ్ .. ఆతరువాత ఫెయిడ్ అవుట్ అయ్యాడు.. చివరిగా మంచు మనోజ్ తో శౌర్య మూవీ చేసి.. ఇక అసలు కనిపించకుండా పోయాడు దశరథ్. ఒకప్పుడు సంతోషం మూవీలాంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఈ దర్శకుడు సుధీర్ తో సినిమా చేసి మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే.. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో చూడాలి.
