Asianet News TeluguAsianet News Telugu

సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్ హార్ట్ టచ్చింగ్‌ కామెంట్స్‌.. వారిచేతే సాడ్‌ సాంగ్‌ రిలీజ్‌.. రీజన్‌ మాత్రం క్రేజీ!

తాను రకరకాల టీవీ షోస్‌ చేస్తూ వచ్చానని, అప్పుడు, ఇప్పుడు ఎంకరేజ్‌ చేస్తూ, ఆదరిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చింది అభిమానులే అని అన్నారు సుధీర్‌. వారి హార్ట్ టచ్‌ అయ్యే విషయం చెప్పాడు.

sudigali sudheer fans heart touching comments in calling sahastra event arj
Author
First Published Nov 8, 2023, 6:42 PM IST

సుడిగాలి సుధీర్‌ బుల్లితెర నటుడిగా ఎదిగాడు. ముఖ్యంగా `జబర్దస్త్` షోతో ఆయన సినిమా రంగంలోకి వచ్చారు. మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి కెరీర్‌ ప్రారంభించారు. `జబర్దస్త్` కామెడీ షో సుధీర్‌కి విశేషమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆయన్ని పాపులర్‌ చేసింది. ఈ క్రమంలో హీరోగా సినిమా అవకాశాలు అందుకున్నాడు సుధీర్‌. `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌` చిత్రంతో ఆకట్టుకున్నాడు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఆ మూవీ కలెక్షన్లని సాధించింది. 

అలాగే ఆ మధ్య `గాలోడు` మూవీ కూడా మంచి ఆదరణ పొందింది. బిజినెస్‌ కంటే ఎక్కువే కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన `కాలింగ్‌ సహస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతుంది. అందులో భాగంగా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు. లేటెస్ట్ గా ఈ మూవీలోని `కనుల నీరు రాలదే` అంటూ సాగే సాడ్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ శ్రోతలను అలరిస్తుంది. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మాట్లాడే క్రమంలో ఫ్యాన్స్ అరుపులతో హాల్‌ హోరెత్తిపోయింది. ఫ్యాన్స్ సమక్షంలో ఈ పాటని విడుదల చేశారు. దీనిపై సుధీర్‌ రియాక్ట్ అవుతూ, ఆనందంలో అందరు ఉంటారు. కానీ బాధలోనూ ఉండేది ఫ్యాన్స్ ఒక్కరే. మనం హ్యాపీగా లేకపోయినా వాళ్లు మనవెంటే ఉంటారు, మనకు అండగా నిలుస్తుంటారు. అందుకే ఈ సాడ్ సాంగ్‌ని వారిచేత రిలీజ్‌ చేయించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 

ఇక తాను  రకరకాలు షోలతో తాను ఎదిగానని, ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చానని, తన ప్రతి జర్నీలో అభిమానులు, ఆడియెన్స్ ఉన్నారని తెలిపారు సుధీర్‌. వారు మొదట్నుంచి ఎంకరేజ్‌ చేసినట్టు చెప్పాడు. వారి కారణంగానే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని వెల్లడిస్తూ, ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు. అయితే పవన్‌ కళ్యాణ్ తరహాలో సుధీర్‌ ఫ్యాన్స్ కూడా మొదట్లో కాసేపు మాట్లాడనివ్వకుండా చేశారు. మధ్య మధ్యలోనే అరుపులతో రచ్చ చేశారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ, `ఈ పాటకి మోహిత్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే జిత్తు మాస్టర్ సాంగ్‌ని చక్కగా కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత విజేష్‌ సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఆయనకు ఇతర ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. బెక్కెంగారు సినిమా చూడగానే ఆయనకు నచ్చటంతో మా టీమ్‌ని నడిపించటం మొదలు పెట్టారు. డాలీషా మంచి నటి. నార్త్ అమ్మాయి అయినా తెలుగు నేర్చుకుని నటించారు. తనింకా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేస్తాం. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తాం` అని చెప్పారు. 

డైరెక్టర్ అరుణ్ విక్కీరాల మాట్లాడుతూ, ``కాలింగ్ సహస్త్ర` తర్వాత సుధీర్ రేంజ్ నెక్ట్స్‌ లెవల్‌ కి చేరుకుంటుంది. తనొక సూపర్ స్టార్ అవుతారు. మేం ఎంత బాగా సినిమాను తీసినా మంచి మ్యూజిక్ లేకపోతే అద్భుతం జరగదు. మోహిత్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. అలాగే మార్క్ కె.రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సూపర్బ్‌గా అందించార`ని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌, నిర్మాత బెక్కంతోపాటు టీమ్‌ పాల్గొంది. సుడిగాలి సుధీర్‌, డాలీషా జంటగా నటించిన `కాలింగ్‌ సహస్ర` చిత్రానికి అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వం వహిస్తున్నారు. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా  నిర్మించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios