జబర్దస్త్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోలో సుధీర్ చేసే కామెడీ పంచ్ లో కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ, సుధీర్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రష్మీ, సుధీర్ ఇద్దరూ ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చారు. 

వీరిద్దరి రిలేషన్ పై మాత్రం రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుధీర్ ఓ ఇంటర్వ్యూలో రష్మితో తనకున్న రిలేషన్ గురించి వివరించాడు. జబర్దస్త్ లో హాస్యాన్ని పండించేందుకు రష్మీతో లింక్ ఉన్నట్లు స్కిట్స్ రాస్తుంటారు. ఆ కామెడీని జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో ఎక్కువగా అలాంటి స్కిట్ లే చేయడం వల్ల రష్మీకి, తనకు మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. రీల్ లైఫ్ ని రియల్ లైఫ్ తో పోల్చి చూడడం సరైంది కాదు. 

అదే విధంగా జబర్దస్త్ లో తనని అమ్మాయిల పిచ్చోడిలా ప్రొజెక్ట్ చేసే విధంగా కొన్ని కామెడీ స్కిట్ లు ఉంటాయి. వాటిని కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో తాను నిజంగానే అమ్మాయిల వెంట అల్లరి చిల్లరిగా తిరిగేవాడని అంతా అనుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. రియల్ లైఫ్ లో నా క్యారెక్టర్ అలాంటిది కాదు. నేను ఎలాంటి వాడినో నా కుటుంబ సభ్యులకు తెలుసు అని సుధీర్ తెలిపాడు. 

ఇలా రష్మితో రిలేషన్ అంటూ ప్రచారం జరగడం వల్ల తనకు పెళ్లి సంబంధాలు సరిగా రావడం లేదనే విషయాన్ని సుధీర్ అంగీకరించాడు. పిల్లనివ్వడానికి ఇవరైనా ముందుకు వచ్చినా నా గురించి ఇలాంటి విషయాలనే ఆరా తీస్తున్నారు అని సుధీర్ తెలిపాడు. 

రియల్ లైఫ్ లో నేను ఓ లవ్ ఫెయిల్యూర్ వ్యక్తిని. అప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నా. భవిష్యత్తులో ప్రేమ జోలికి కూడా వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నట్లు సుధీర్ తెలిపాడు.