'జబర్దస్త్' షోతో బుల్లితెరపై అల్లరి చేసే సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీషోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు తన ప్రేమను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీద ఏడ్చేసిన సుధీర్ ని మంచు లక్ష్మీ ఓదార్చే ప్రయత్నం చేసింది

'జబర్దస్త్' షోతో బుల్లితెరపై అల్లరి చేసే సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీషోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు తన ప్రేమను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీద ఏడ్చేసిన సుధీర్ ని మంచు లక్ష్మీ ఓదార్చే ప్రయత్నం చేసింది. అసలు విషయంలోకి వస్తే.. సుడిగాలి సుధీర్ 12 ఏళ్ల పాటు ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కానీ అమ్మాయి అతడిని వదిలేసి మరెవరినో పెళ్లి చేసుకోవడంతో ఆ బాధ నుండి రావడానికి చాలా సమయం పట్టిందని తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. 'ఐదో తరగతి చదివే సమయంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తొమ్మిదో తరగతి వచ్చేసరికి తను కూడా నన్ను ఇష్టపడింది. అలా పన్నెండేళ్ల పాటు మా ప్రేమ కొనసాగింది. నేను హైదరాబాద్ కి వెళ్తున్నాను సెటిల్ అయి వస్తాను అని ఆ అమ్మాయికి చెప్పి వచ్చాను. తను కూడా నీకోసం ఎదురుచూస్తుంటానని చెప్పి పంపించింది.

కానీ సడెన్ గా ఒకరోజు ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ అమ్మాయికి పెళ్లైంది లవ్ మ్యారేజ్ అంట అని చెప్పాడు. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నాను.. నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది' అంటూ చిన్నప్పటి తన ప్రేమ విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. అతడితో పాటు ఆ షోలో పాల్గొన్న ప్రియమణి, మంచు లక్ష్మీ అతడిని ఓదార్చారు.