`జబర్దస్త్` ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ కరోనాకి గురైనట్టు తెలుస్తుంది. ఆయన అనారోగ్యానికి గురి కావడంతో అనుమానంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలిందట. తాజాగా ఈ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సుధీర్‌ హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

లాక్‌ డౌన్‌ ఎత్తేయడం, షూటింగ్‌లకు అనుమతివ్వడంతో టీవీ షూటింగ్‌లు షురూ అయ్యాయి. చాలా రోజులుగా టెలివిజన్‌ షోస్‌ చిత్రీకరణలు జరుగుతూనే ఉన్నాయి. సుధీర్‌ కూడా వాటిలో పాల్గొంటున్నాడు. ఆయన దసరా కో్సం రష్మి వంటి ఇతర సెలబ్రిటీలు, ఆర్టిస్టులతో కలిసి `అక్కా ఎవడే అతగాడు` అనే ఓ స్పెషల్‌ షోలో పాల్గొంటున్నాడు. ఇందులో సుధీర్‌తోపాటు ఆయన ప్రియురాలు రష్మీ గౌతమ్‌, యాంకర్లు, జడ్జ్ లు వర్షిణి, శేఖర్‌ మాస్టర్, నటి సంగీత వంటి వారు పాల్గొన్నారు. ఈ షో దసరా సందర్భంగా ఈ నెల 25న ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

అయితే ఇలాంటి షోస్‌లో సుధీర్‌ పాల్గొనడంతో ఇప్పుడు వారంతా టెన్షన్‌ పడుతున్నారని సమాచారం. సుధీర్‌కి వచ్చిందన వార్త తెలిసి ఆందోళన చెందుతున్నారట. వారంతా హోం క్వారంటైన్‌ అయినట్టు టాక్‌. ముఖ్యంగా సుధీర్‌, రష్మీ మధ్య ఏదో ఉందనే ప్రచారంసోషల్‌ మీడియాలో జరుగుతుంది. వీరిద్దరు కలిసి చాలా రోజులుగా డేటింగ్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజా వార్తతో రష్మీ బాగా టెన్షన్‌ పడుతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది అధికారిక ప్రకటనగానీ, ఎవరైనా స్పందిస్తేగానీ తెలుస్తుంది.

సుధీర్‌ ప్రస్తుతం `ఢీ ఛాంపియన్స్` రియాలిటీ షోతో పాటు, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో హీరో ఫ్రెండ్‌గా నటిస్తున్నారు. గతేడాది `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`తో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. `త్రీమంకీస్‌`లోనూ హీరోగా మెప్పించారు.